పార్టీ బలోపేతమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పార్టీ బలోపేతమే లక్ష్యం

Feb 9 2026 7:41 AM | Updated on Feb 9 2026 7:41 AM

పార్టీ బలోపేతమే లక్ష్యం

పార్టీ బలోపేతమే లక్ష్యం

● తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో సోషల్‌ మీడియా ముందుండాలి ● అధికార పార్టీ తప్పిదాలను ప్రజలకు తెలియజేయాలి ● మాజీ మంత్రి ఆర్‌కే రోజా

నగరి : వైఎస్సార్‌ సీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ యువజన విభాగం, సోషల్‌ మీడియా పనిచేయాలని మాజీ మంత్రి ఆర్‌కే రోజా పిలుపునిచ్చారు. ఆమె ఆదివారం తన నివాసంలో వున్న కార్యాలయం వద్ద సోషల్‌ మీడియా, యువజన, విద్యార్థి, ఐటీ, ప్రచార విభాగాల రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడు తూ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలో ప్రజల పక్షాన నిలబడి ముందుకు సాగాలన్నారు. టీడీపీ గూండాలు, రౌడీలతో వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి మీద, వైఎస్సార్‌ సీపీ పార్టీ కీలక నాయకుల మీద ప్రభుత్వం తప్పు డు ప్రచారం చేయిస్తోందని ఆరోపించారు. ఆ దాడులు, బెదిరింపులను ఎదుర్కొంటూ వెనక్కి తగ్గకుండా పార్టీ శ్రేణులు ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. మనం జగనన్న సైనికులమని, ఆయనను ఆదర్శంగా తీసుకుని బలంగా నిలబడాలన్నారు. సోషల్‌ మీడియా సహా అన్ని వేదికల్లో వాస్తవాలతో అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. జగనన్న ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పును ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ భవిష్యత్తు కార్యకర్తల చేతుల్లోనే ఉందన్నారు. ప్రతి విభా గం సమన్వయంతో పనిచేస్తేనే పార్టీ మరింత బలపడుతుందన్నారు. యువత, విద్యార్థులు, సోషల్‌ మీడియా వలంటీర్లు పార్టీకి బలమైన ఆయుధాలుగా మారాలని పిలుపునిచ్చారు. అలాగే అన్ని మండలాల్లో పంచాయతీ, వార్డు స్థాయిలో అనుబంధ కమిటీలు, పార్టీ కోర్‌ కమిటీలను తక్షణమే పూర్తి చేసి పార్టీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేయాలని సూచించారు. కమిటీలు పూర్తయిన తర్వాత అన్ని విభాగాల అధ్యక్షులు, సభ్యులతో గ్రూపులు ఏర్పాటు చేసి పార్టీ కార్యక్రమాలు, పార్టీ తీసుకునే నిర్ణయాలు వారికి వేగంగా చేరేలా పనిచేయాలన్నారు. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే ప్రతి కార్యకర్తను పార్టీ తప్పకుండా గుర్తిస్తుందన్నారు. ఈ సందర్భంగా యువశ్రేణులు మాజీ మంత్రిని గజమాలతో సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement