నేడు కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక

Feb 9 2026 7:41 AM | Updated on Feb 9 2026 7:41 AM

నేడు కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక

నేడు కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రజల సమస్యల పరిష్కా రం కోసం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ వెల్లడించారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి ఫిర్యా దులు స్వీకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హా జరుకావాలని ఆదేశించారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు.

పోలీసు కార్యాలయంలో..

అలాగే చిత్తూరు నగరంలోని వన్‌టౌన్‌ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్‌) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్‌డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్‌ డూడీ తెలిపారు. ఉదయం 10.30 నుంచి ప్రజలు తనను నేరుగా కలిసి సమస్యలు తెలియజేయవచ్చని వెల్లడించారు. వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామని తెలిపారు.

జ్యోతిబాపూలే స్కూల్‌లో ప్రవేశానికి దరఖాస్తులు

పెద్దపంజాణి : మండలంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబందించి 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ ఏ.జ్యోత్స్న తెలిపారు. ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ 5వ తరగతిలో 40 సీట్లు, 6, 7, 8 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 5వ తరగతిలో చేరడానికి ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాలలో 2024–25, 2025–26లో చదివి ఉండాలన్నారు. బీసీ, ఈబీసీ విద్యార్థులు 2015 సెప్టెంబర్‌ 01, 2017 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలన్నారు. తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలకు మంచరాదన్నారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తిగల వారు ఆన్‌లైన్‌లో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి లేదా సంరక్షకుని మొబైల్‌ నెంబర్‌ వివరాలతో రూ.100 చెల్లించిన తర్వాత వచ్చే జర్నల్‌ నంబర్‌ ఆధారంగా mjpapbcwreis.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా 2026 మార్చి 04లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం పెద్దపంజాణి మండలం శంకర్రాయలపేటలోని పాఠశాలలో సంప్రదించాలన్నారు.

నేడు డయల్‌ యువర్‌ ఎస్‌ఈ

చిత్తూరు కార్పొరేషన్‌ : విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌ అహ్మద్‌ తెలిపారు. వినియోగదారులు ఉద యం 8.30 నుంచి 9.30 గంటల మధ్య 7993147979 నంబర్‌కు ఫోన్‌ చేసి సమస్యలు తెలియజేయవచ్చని వెల్లడించారు. వాటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

చిత్తూరు కలెక్టరేట్‌ : చిత్తూరు నగరంలోని పీసీఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏపీ పీఈటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పీఈటీ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర సంఘం తరపున సుబ్రహ్మణ్యంరెడ్డి, సమన్వయకర్తగా అన్నమయ్య జిల్లా కార్యదర్శి అన్సర్‌ బాషా, హెచ్‌ఎం అసోసియేషన్‌ కార్యదర్శి సురేష్‌ వ్యవహరించారు. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల నుంచి 126 మంది ఓటు వేశారు. జిల్లా అధ్యక్షుడిగా సిరాజ్‌ అహ్మద్‌, కార్యదర్శిగా దేవానంద్‌, కోశాధికారిగా శశిప్రకాష్‌ ఎన్నికయ్యారు. నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ జిల్లాలో పీఈటీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 81,777 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,209 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.7 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement