నేడు వేలం పాటు
చిత్తూరులో మార్కెట్ గేటు, ప్రైవేటు బస్సుల నుంచి రుసుములు వసూలు చేసుకోవడం, జంతు వధశాల నుంచి రుసుములు వసూలు చేసుకునే ప్రక్రియలకు బుధవారం ఉదయం 11 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలో బహి రంగ వేలం పాట నిర్వహించనున్నారు. 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31వ తేదీ వరకు రుసుము వసూలు చేసుకోవడానికి వేలం పాట జరగనుంది. గతేడాది చుడా చైర్‌పర్సన్ అనుచరులు వేలంపాటలో పోటీచేసినా.. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని పాట ముందుకు పోలేదు. ఎమ్మెల్యే వర్గమే రూ.62.04 లక్షలకు వేలం దక్కించుకుంది. ఈసారి వేలం పాటలో ఎవరు పోటీపడుతారో..? గేటు ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సి ఉంది.


