వాటిని స్వేచ్ఛగా తిరగనిద్దాం!
– పాములను చంపకుండా రెస్క్యూ సిబ్బంది: సీఎఫ్‌ఓ
గంగవరం: అటవీ ప్రాంతాల్లో నివసించే జంతువులకు స్వేచ్ఛతో పాటు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అనంతపురం సర్కిల్ సీఎఫ్‌ఓ(కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) యశోధ తెలిపారు. మండలంలోని గజారామం వన సంరక్షణ కేంద్రంలో జిల్లా లోని అటవీశాఖ అధికారులు, సిబ్బందితో మంగళవారం ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీఎఫ్‌ఓతో పాటు డీఎఫ్‌ఓ సుబ్బరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ జిల్లాలో ఆర్‌ఆర్‌ఆర్‌టీ(ర్యాపిడ్ రెస్క్యూ రెస్పాన్స్ టీమ్స్)ను హనుమాన్ కార్యక్రమం కింద ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆర్‌ఆర్ టీమ్స్‌లోకి కావాల్సిన స్టాఫ్ మెంబర్స్, వలంటీర్స్ అందరికీ హ్యూ మన్ వైల్డ్ లైఫ్‌ను ఎలా డీల్ చేయాలి అనేదానిపై ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. జిల్లాలో ఏనుగులు, ఎలుగుబంటి, చిరుత వంటి జంతువులు అకారణంగా బలవుతున్నాయని, వాటి సంరక్షణ ఎలా తీసుకోవాలి అనే అంశంపై శిక్షణ ఇస్తున్నట్టు వెల్లడించారు.
ప్రతి గ్రామంలో స్నేక్ రెస్క్యూ
గ్రామాలు, పొలాల్లోకి వచ్చే పాముల ద్వారా ప్రజలు ప్రమాదాలకు గురవ్వడం అప్పుడపుడూ జరుగుతుంటుందన్నారు. అందుకోసం గ్రామ స్థాయిలో స్నేక్ రెస్క్యూను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వలంటీర్లను ఎంపిక చేసి వాళ్లకి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు సర్టిఫైడ్ స్నేకర్‌గా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నా రు. పాములకు అపాయం జరక్కుండా వాటి ని పట్టి తిరిగి అడవుల్లో వదిలేయడం జరుగుతుందన్నారు.
మార్చి 3న అనుమాన్ మొబైల్ యాప్
డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మార్చి 3వ తేదీ న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తారని ఆ కార్యక్రమంలో హనుమాన్ మొబైల్ యాప్‌ను తీసుకురావడం జరుగుతుందన్నారు. అందుకోసమే ప్రతి గ్రామంలో ఒక వలంటీర్‌ను ఎంపిక చేస్తామన్నారు. అడవి కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఏనుగును కూడా కాపాడుకోగలదన్నారు. అందుకే కౌండిన్య అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు.తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఏనుగుల రాకను పూర్తి గా అరికట్టడం ఎవరివల్లా కాదన్నారు. అయి తే అడవిలో నుంచి పంట పొలాల్లోకి రాకుండా సోలార్ ఫెన్సింగ్ వంటివి ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.


