సీనియారిటీ జాబితాకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

సీనియారిటీ జాబితాకు శ్రీకారం

Feb 18 2026 7:16 AM | Updated on Feb 18 2026 7:16 AM

సీనియారిటీ జాబితాకు శ్రీకారం

సీనియారిటీ జాబితాకు శ్రీకారం

● ఫిబ్రవరి 25న ఉపాధ్యాయుల తొలి జాబితా ● సమగ్ర షెడ్యూల్‌ జారీచేసిన రాష్ట్ర విద్యాశాఖ ● కసరత్తు మొదలు పెట్టిన జిల్లా విద్యాశాఖ అధికారులు

చిత్తూరు కలెక్టరేట్‌ : వేసవి సెలవుల్లో చేపట్టబోయే ఉద్యోగోన్నతులు, బదిలీల ప్రక్రియ లో డేటా కచ్చితత్వంగా ఉండేందుకు టీచర్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ (టిస్‌)ను అప్‌డేట్‌ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఈ ప్రక్రియను జిల్లా విద్యాశా ఖ అధికారులు పకడ్బందీగా మొదలుపెట్టారు. జిల్లా పరిషత్‌, ప్రభుత్వ, మండల పరిషత్‌, మున్సిపల్‌ మేనేజ్‌మెంట్‌లలో ని టీచర్లందరికీ కచ్చి తమైన సీనియారిటీని ఖరారు చేసేలా చర్యలు చేపడుతున్నారు.

టిస్‌ ఆధారంగా జాబితాలు

గతంలో లీప్‌ యాప్‌ ద్వారా ఉపాధ్యాయులు తమ వివరాలను సరిచూసుకునే అవకాశం కల్పించగా, అందులో వచ్చిన మార్పులు, చేర్పులను పరిగణనలోకి తీసుకుని తు ది జాబితాల తయారీకి చర్యలు చేపట్టారు.

జిల్లా స్థాయిలో

గ్రీవెన్స్‌ రిడ్రెస్సల్‌ సెల్‌ ఏర్పాటు

టీచర్‌ల నుంచి వచ్చే అభ్యంతరాలను, ఫిర్యాదుల ను పరిష్కరించేందుకు జిల్లాలో ఒక ప్రత్యేక గ్రీవెన్స్‌ రిడ్రెస్సల్‌ సెల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సెల్‌కు ఉమ్మడి జిల్లా డీఈవో చైర్మన్‌గా, ఉమ్మడి జిల్లా ఏడీ కన్వీనర్‌గా, కొత్త జిల్లా ఏడీ సభ్యులుగా ఉంటారు. ప్రతి కేడర్‌ హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీలకు విడివిడిగా కమిటీలు ఏర్పా టు చేస్తారు. ఈ కమిటీలు ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తాయి. జిల్లా కమిటీ తీసుకున్న నిర్ణయాల పై అభ్యంతరాలు ఉంటే ఆర్జేడీ కార్యాలయంలో అప్పీల్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు.

జాబితాల ఆధారంగానే..!

ప్రస్తుతం సిద్ధం చేసే సీనియారిటీ జాబితాల ఆధారంగానే ఉద్యోగోన్నతుల ప్రక్రియ నిర్వహిస్తారు. ఎస్జీటీ కేడర్‌ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌కు ఉద్యోగోన్నతి కల్పించే అధికారం డీఈవోకు కల్పించారు. స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌ నుంచి గ్రేడ్‌ 2 హెచ్‌ఎం ఉద్యోగోన్నతులకు ఆర్జేడీకి అధికారాలు ఇస్తున్నట్లు సూచించారు. మేనేజ్‌మెంట్‌ల వారీగా, సబ్జెక్టులు వారీగా విడివిడిగా సీనియారిటీ జాబితాలను వెబ్‌సైట్‌లో ప్రదర్శించనున్నారు. ఈ ప్రక్రియ మార్చి 30 వ తేదీ వరకు నిర్వహించేలా షెడ్యూల్‌ జారీచేశారు. జాబితా ప్రచురించిన తర్వాత ఉద్యోగోన్నతుల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త అప్పీళ్లను స్వీకరించేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement