ముస్తాబైన పెళ్లి మండపం(ఇన్‌సెట్) గజ, సింహ వాహనాలపై శివ
శ్రీకాళహస్తిలో పెళ్లి కళ ఉట్టిపడింది. మామిడి తోరణాలు, అరటి పిలకలు, విద్యుద్దీపాలతో ఆకట్టుకుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శివపార్వతుల కల్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. బుధవారం వేకువజామున జరగనున్న స్వామి, అమ్మవార్ల పెళ్లికి సర్వం సిద్ధం చేశారు. ఆలయ అలంకార మండపంలో శివపార్వతులను వధూవరులుగా ముస్తాబు చేశారు. స్వామి, అమ్మవార్ల బుగ్గన దిష్టి చుక్కను పెట్టి, పెళ్లి దుస్తులు అలంకరించి గజ, సింహ వాహనాలపై అధిష్టింపజేసి పెళ్లి మండపానికి సాగనంపారు. బుధవారం వేకువ జామున ఆదిదంపతుల వివాహ మహోత్సవాన్ని నిర్వహించేందుకు అర్చకపండితులు సన్నాహాలు పూర్తి చేశారు. దేవుడి పెళ్లి సుమూహూర్తంలో కొత్త జంటలు ఒక్కటయ్యేందుకు సిద్ధమయ్యారు. మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేరు మీదుగా స్థానిక మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో 48 కొత్త జంటలకు బంగారు తాళిబొట్లు పంపిణీ చేశారు. – శ్రీకాళహస్తి
ముక్కంటి క్షేత్రంలో ఉట్టిపడిన పెళ్లి కళ
శివపార్వతుల కల్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు
ఒక్కటయ్యేందుకు సిద్ధమైన జంటలు
48 జంటలకు మాజీ ఎమ్మెల్యే బంగారు తాళిబొట్ల పంపిణీ