పీఎస్‌హెచ్‌ఎం జిల్లా కార్యవర్గం ఎంపిక | - | Sakshi
Sakshi News home page

పీఎస్‌హెచ్‌ఎం జిల్లా కార్యవర్గం ఎంపిక

Feb 7 2026 9:45 AM | Updated on Feb 7 2026 9:45 AM

పీఎస్

పీఎస్‌హెచ్‌ఎం జిల్లా కార్యవర్గం ఎంపిక

పుత్తూరు : మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ హెడ్‌ మాస్టర్స్‌ (పీఎస్‌హెచ్‌ఎం) ఫోరం తిరుపతి జిల్లా కార్యవర్గాన్ని శుక్రవారం పుత్తూరులో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రం ఫోరం కార్యదర్శి శ్రీనివాసులు, అసోసియేట్‌ ఉపాధ్యక్షుడు రమణ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం త్వరలో సమగ్ర ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఏప్రిల్‌లో చేపట్టనున్న బదిలీల్లో పీఎస్‌హెచ్‌ఎంలకు తొలి ప్రాధాన్యత ఇచ్చి స్కూల్‌ అసిస్టెంట్స్‌గా నియమించాలని డిమాండ్‌ చేశారు. జనవరి 13న ప్రభుత్వం ఇచ్చిన మెమోను అందరికీ ఆమోదయోగ్యంగా సవరించాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమ బాట పడ తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా ఫోరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా కె.గోపి (ఏర్పేడు), అధ్యక్షుడిగా వి.వెంకటరమణ (నాగలాపురం), ప్రధాన కార్యదర్శిగా ఎస్‌.మధుసూదన్‌రాజు (తిరుపతి రూరల్‌), కోశాధికారిగా కె.నరేష్‌ (వడమాలపేట), మహిళా అధ్యక్షురాలుగా డి.గీర్వాణి (తిరుపతి రూరల్‌), అసోసియేట్‌ అధ్యక్షులుగా, కార్యనిర్వాహక సభ్యులుగా మరి కొందరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

చెరువులో మృతి చెందిన

వ్యక్తి గుర్తింపు

తవణంపల్లె: మండలంలోని టి.పుత్తూరు చెరువులో మృతి చెందిన వ్యక్తిని గుర్తించినట్లు తవణంపల్లె ఎస్‌ఐ డాక్టర్‌ నాయక్‌ తెలిపారు. ఎస్‌ఐ కథనం.. పూతలపట్టు మండలం, పాపానాయుడుపల్లెకు చెందిన జి.నందకుమార్‌నాయుడు(48) ఈ నెల ఒకటవ తేదీన తవణంపల్లెలో ఉంటున్న తన అన్న మొగిలప్పనాయుడు ఇంటికి వచ్చాడు. తర్వాత కూలి పనులకు వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. మద్యం సేవించి కాలకృత్యాలు తీర్చుకోవడానికి టి.పుత్తూరు చెరువులోకి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోయాడు. స్థానికులు గుర్తించి సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. శవం ఉబ్బి పోయి గుర్తుపట్టలేని విధంగా మారింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు.

వెంకటరమణ, అధ్యక్షుడు

గోపి,

గౌరవాధ్యక్షుడు

పీఎస్‌హెచ్‌ఎం  జిల్లా కార్యవర్గం ఎంపిక 1
1/3

పీఎస్‌హెచ్‌ఎం జిల్లా కార్యవర్గం ఎంపిక

పీఎస్‌హెచ్‌ఎం  జిల్లా కార్యవర్గం ఎంపిక 2
2/3

పీఎస్‌హెచ్‌ఎం జిల్లా కార్యవర్గం ఎంపిక

పీఎస్‌హెచ్‌ఎం  జిల్లా కార్యవర్గం ఎంపిక 3
3/3

పీఎస్‌హెచ్‌ఎం జిల్లా కార్యవర్గం ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement