పదో తరగతి యాక్షన్‌ప్లాన్‌ను పాటించాలి | - | Sakshi
Sakshi News home page

పదో తరగతి యాక్షన్‌ప్లాన్‌ను పాటించాలి

Feb 15 2026 7:27 AM | Updated on Feb 15 2026 7:27 AM

పదో తరగతి యాక్షన్‌ప్లాన్‌ను పాటించాలి

పదో తరగతి యాక్షన్‌ప్లాన్‌ను పాటించాలి

పలమనేరు: పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న వందరోజుల యాక్షన్‌ ప్లాన్‌పై నిర్లక్ష్యం చేయరాదని డీఈఓ రాజేంద్ర ప్రసాద్‌ సూచించారు. పట్టణంలోని బాలికల పాఠశాలలో శనివారం జరిగిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్టడీ అవర్‌లో పిల్లల అభ్యసనస్థాయిని పరిశీలించారు. టెన్త్‌ విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశాన్ని ఇచ్చారు. కష్టపడి చదివితే విజయం దక్కుంతుందన్నారు. స్థానిక బాలుర హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనాన్ని పరీశీలించారు. భవిత సెంటర్‌లో జరుగుతున్న అభ్యసనాలను తెలుసుకున్నారు. వచ్చే టెన్త్‌ పరీక్షల్లో జిల్లాలో ఉత్తమ ఫలితాలు రావాలంటే ఇప్పటి నుంచే ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందులో ఎంఈఓలు లీలారాణి, బాలసుందరం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement