అర్జీదారుల ఆర్తనాదాలు
చిత్తూరు కలెక్టరేట్ : అయ్యా.. మాకు కళ్లు కనపడవు, కాళ్లు లేక పనులు చేసుకోలేని దుస్థితి.. ఆకలితో అలమటిస్తున్నాం....వృద్ధాప్యంలో అనారోగ్యాలతో కుశిస్తున్నాం. మమ్మల్ని మనుషులుగా చూడరా? మా మొర ఆలకించరా ? అంటూ అర్జీదారులు కన్నీరుమున్నీరయ్యారు. సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ (ప్రజాసమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమం నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వందలాది మంది విచ్చేసిన అర్జీలు అందజేసి, తమ గోడును వెళ్లబోసుకున్నారు.
దయచూపండి
గుడిపాల మండలం, రాయలచేను చిత్తపార పంచాయతీకి చెందిన 18 కుటుంబాలు తమ గ్రామంలో కనీస మౌలిక వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్ని సార్లు వినతిపత్రం అందజేసినా పట్టించుకోవడం లేదన్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి న్యాయం చేయాలని వేడుకున్నారు.
అర్జీలు స్వీకరిస్తున్న జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్
ఇంటి స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతున్న జాండ్రపేట గ్రామస్తులు
అర్జీదారుల ఆర్తనాదాలు


