వెలుగుబాటలో నైట్ విజన్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా పటిష్ట ప్రణాళిక అమలు చేస్తున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. జిల్లాలో నైట్ విజన్ కార్యక్రమం అమలులో భాగంగా మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని పలువురు విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి నైపుణ్యాలను పరిశీలించారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా విద్యాశాఖ సరికొత్త అడుగులు వేస్తోందన్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని సంతపేట పీఎన్‌సీ మున్సిపల్ పాఠశాల పరిధిలో విద్యార్థుల ఇళ్ల వద్ద నైట్ విజన్ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ హేమాద్రి, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ బాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూమి ఆక్రమణ
రొంపిచెర్ల: అనంతపురం– చైన్నై జాతీయ రహదారిలోని రొంపిచెర్ల మండలం, బండకిందపల్లె గ్రామ పంచాయతీలో రూ.3 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. దీనిపై కమోళ్లపల్లె, మట్లోళ్లపల్లె గ్రామస్తులు కలెక్టర్ సుమిత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. జాతీయ రహదారి పక్కన భూముల ధరలు కోట్లల్లో పలుకుతున్నాయి. రెవెన్యూ అధికారులు సకాలంలో స్పందించక పోవడంతో అక్రమణ దారులు రెండు మూడు రోజులుగా సర్వే నం.36లో సుమారు రూ.75 సెంట్ల భూమిని జేసీబీతో చదును చేసి చుట్టూ కంచె ఏర్పాటు చేసి మామిడి మొక్కలు కూడా నాటేశారు. దీనిపై కలెక్టర్‌కు రైతులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందిస్తూ అక్రమణదారుడిపై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను అదేశించారు. ఇరిగేషన్ ఏఈ మునిశేఖర్ సదరు సప్లయ్ చానల్‌ను పరిశీలించగా.. ఆ చానల్ ఆనవాళ్లే కనిపించలేదు.
నిర్లక్ష్యం చేసిన ముగ్గురికి మెమోలు
జాతీయ రహదారి పక్కనే ప్రభుత్వ భూమి అక్రమణకు గురవుతున్నా బండకిందపల్లె వీఆర్వో సురేంద్ర, వీఆర్‌ఏలు ఇర్ఫాన్‌అలీ, లక్ష్మణ్‌కు మెమోలు ఇచ్చినట్లు తహసీల్దార్ కిరణ్‌కుమార్ మంగళవారం తెలిపారు.
వెలుగుబాటలో నైట్ విజన్


