నేడు జిల్లా స్థాయి చెస్ పోటీలు
తిరుపతి ఎడ్యుకేషన్ : నగరంలలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ నెల 17వ తేదీన ఉదయం 9గంటలకు జిల్లా స్థాయి చెస్ పోటీలను నిర్వహించనున్నట్లు డీఎస్‌డీఓ ఎన్.శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. శాప్ లీగ్ లో భాగంగా ఈ పోటీలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మంగళవారం అండర్–13, 15, 17, 19 విభాగాల్లో పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 24వ తేదీన ఉదయం 8గంటలకు శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో జూనియర్ అండర్–18 ఇండివిడ్యువల్ టైమ్ ట్రావెల్ అండ్ మాస్టర్ విభాగంలో సైక్లింగ్ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన చెస్ క్రీడాకారులు ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించను న్న రాష్ట్ర స్థాయి పోటీల్లో, అలాగే ఈ నెల 28, మార్చి 1 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీల్లో పాల్గొంటారని డీఎస్‌డీఓ తెలిపారు.
‘డయల్ యువర్ సీఎండీ’కి
51 వినతులు
తిరుపతి రూరల్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమంలో సోమవారం 51 వినతులు అందినట్లు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ తెలిపారు. తిరుపతిలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు విద్యుత్ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్ ఖాన్, కె.గురవయ్య, కె.రామమోహన్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు పి.హెచ్.జానకి జె. రమణా దేవి, ఆర్.పద్మ, యం.మురళీ కుమార్, యం.కృష్ణా రెడ్డి, సిహెచ్ రామచంద్ర రావు, కె.సంపత్ కుమార్, జనరల్ మేనేజర్లు విజయన్, చక్రపాణి, సురేంద్రరావు, భాస్కర్‌రెడ్డి, జగదీష్, లత పాల్గొన్నారు.


