బ్రహ్మసారథ్యం.. భవుని రథోత్సవం
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
నేటి నుంచి మహాసంప్రోక్షణ
నాగలాపురంలోని వేదనారాయణస్వామి ఆలయంలో మంగళవారం నుంచి మహాసంప్రోక్షణ ప్రారంభం కానుంది.
అర్జీదారుల ఆర్తనాదాలు
అర్జీదారుల ఆర్తనాదాలతో కలెక్టరేట్ మార్మోగింది. సమస్యలు పరిష్కరించాలంటూ పలువురు అర్జీలు సమర్పించారు.
మంగళవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
తెప్పపై ఊరేగుతున్న సోమస్కందుడు
సమస్త భూమండలాన్ని రథంగాను..సూర్యచంద్రాదులను నేత్రాలుగా.. భూమ్యాకాశాలను చెవులుగా..అగ్నిభట్టారుకుడిని మూడో నేత్రంగా.. చతుర్వేదాలను వాక్కు..నాలుగు దిక్కులను రథ చక్రాలుగా..చేసుకున్న ఆదిమధ్యాంత రహితుని రథోత్సవ వైభవ దర్శనంతో భక్తకోటి మనో రథం ఫలించింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం నిర్వహించిన రథోత్సవ వేడుకల్లో.. దివ్యరథాలపై ముందు సోమస్కందుడు.. వెనుక జ్ఞానప్రసూనాంబ రథోత్సవం ఆద్యంతం నయనోత్సవంగా సాగింది. రథోత్సవం వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో వాయులింగేశ్వరుని క్షేత్రం ఇసుకేస్తే రాలనంతగా నిండిపోయింది. రథోత్సవం సందర్భంగా భక్తులు ఉప్పు, మిరియాలను రథంపై చల్లి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, పాలకమండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఈఓ బాపిరెడ్డి, పాలకమండలి సభ్యులు, బీజేపీ నాయకుడు కోలా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాత్రి నారదపుష్కరిణిలో త్రినేత్రుని తెప్పోత్సవం వైభవంగా సాగింది. – శ్రీకాళహస్తి
బ్రహ్మసారథ్యం.. భవుని రథోత్సవం
బ్రహ్మసారథ్యం.. భవుని రథోత్సవం
బ్రహ్మసారథ్యం.. భవుని రథోత్సవం
బ్రహ్మసారథ్యం.. భవుని రథోత్సవం


