రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంకెల గారడీగా మారింది. అన్ని వర్గాలను బురిడీ కొట్టించింది. ప్రాధాన్యత రంగాలకు తగిన కేటాయింపులు లేకపోవడంతో నిరాశ పరిచింది. సూపర్‌సిక్స్‌..డూపర్‌ ప్లాప్‌ అయ్యింది. యువతకు జాబ్‌ క్యాలెండర్‌ ఉసే లేకు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంకెల గారడీగా మారింది. అన్ని వర్గాలను బురిడీ కొట్టించింది. ప్రాధాన్యత రంగాలకు తగిన కేటాయింపులు లేకపోవడంతో నిరాశ పరిచింది. సూపర్‌సిక్స్‌..డూపర్‌ ప్లాప్‌ అయ్యింది. యువతకు జాబ్‌ క్యాలెండర్‌ ఉసే లేకు

Feb 17 2026 7:47 AM | Updated on Feb 17 2026 7:47 AM

రాష్ట

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జ

వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి

బడ్జెట్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లింపుల గురించి స్ప ష్టత ఇవ్వలేదు. బకాయి లు రూ.8,900 కోట్లు ఉండగా బడ్జెట్‌లో రూ.3,836 కోట్లు కేటాయించారు. తల్లికివందనం బకాయిలకు కేటాయింపులు లేదు. సంక్షేమ హాస్టల్‌, గురుకులాలకు రూ.800 కోట్లు చాలా తక్కువ. హామీలను నిలబెట్టుకోవడానికి నిధులు కేటాయించకపోవడం దా రుణం. విద్య, ఉపాధి, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. నిరుద్యోగులకు భృతి ఇవ్వలేదు, పోనీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారంటే అదీ చేయలేదు. యువత ఉద్యోగాల కో సం పక్క రాష్ట్రాలకు వలస వెళ్లి కష్టపడుతున్నారు. – జ్ఞానజగదీష్‌,

రాష్ట్ర అధ్యక్షుడు, మొదలియార్‌ విభాగం, వైఎస్సార్‌సీపీ

అన్ని వర్గాలను మోసగించారు

బడ్జెట్‌లో అన్ని వర్గాలను మోసగించారు. మేనిఫెస్టోలో పెట్టిన పథకాలకు నిధులు కేటాయించ లేదు. అన్నదాత సుఖీభవకు దాదాపు రూ.10 వేల కోట్లు అవసరం కాగా రూ.6,600 కోట్లు కేటాయించారు. సున్నా వడ్డీ, మద్దతు ధర ప్రస్తావన లేదు. నాడు – నేడు పథకానికి వైఎస్‌ఆర్సీపీ ప్రభుత్వంలో రూ.7,800 కోట్లు కేటాయిస్తే ప్రస్తుతం రూ.1,500 కోట్లు కేటయించి చేతులు దులుపుకున్నారు. అర్హులైన వారు పింఛన్‌ కోసం ఎదురు చూస్తున్నా పట్టించుకోవడం లేదు. పీఆర్‌, ఐఆర్‌ ఇవ్వకుండా ఉద్యోగులను మోసం చేస్తున్నారు. – రాహుల్‌రెడ్డి,

రాష్ట్ర కార్యదర్శి(పార్లమెంట్‌), వైఎస్సార్‌సీపీ

యువతకు ఉపాధి ఎక్కడ?

బడ్జెట్‌లో అంకెల గారడీ తప్ప ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. రైతులకు మద్దతు ధర, యువతకు ఉపాధి అవకాశాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి అంశాల పై సృష్టత కరుమైంది. పెండింగ్‌ నిధుల చెల్లింపునకు బడ్జెట్‌లో కేటాయింపులు జరగలేదు. జాబ్‌ క్యాలెండర్‌ పై సృష్టత లేదు. కూటమి ప్రభుత్వం పై యువత పెట్టుకున్న ఆశలు అడియాశలు చేశారు. నమ్మినవారిని ముంచడం, చంద్రబాబు నైజమని మరోసారి నిరూపించారు. ఇటువంటి రాజకీయ నాయకులు ప్రజల నమ్మకాలను కోల్పోతున్నారు.

– అశోక్‌కుమార్‌, చిత్తూరు మండలం

పింఛనేది బాబూ?

ఎన్నికల ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన మంజూరు చేస్తామని వాగ్దానం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితుల్లో చంద్రబాబు సర్కారు ఉంది. హామీ మేరకు అర్హులైన వారికి పింఛన్‌ ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ తరుణంలో బడ్జెట్‌లో ఒక రూపాయి కేటాయించకపోవడతో పథకం ఎత్తేశారనే సంకేతాలు వస్తున్నాయి.

– ఆర్ముగం, చిత్తూరు మండలం

భ్రుతి ఊసే లేదు

ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు అవుతున్నా నిరుద్యోగుల ఊసే ఎత్తట్లేదు. నిరుద్యోగభృతి హామీ అయితే ఇచ్చారు గానీ అమలు పై ధీమా లేకుండా చేస్తున్నారు. అసలు నిరుద్యోగ భృతి అమలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా? లేకుంటే యూటర్న్‌ తీసుకుంటారా?. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించాలని చూస్తున్నారు.

– రాజేష్‌, గుడిపాల

ఆడబిడ్డ నిధి హామీ గుర్తులేదా?

అధికారంలోకి రావడం కోసం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు దాటిన మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతోంది. ఇంతవరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో ఒక్క పైసా కూడా ఆడబిడ్డ నిధి కింద ప్రభుత్వం కేటాయించ లేదు. మహిళలను మోసం చేస్తోంది.

– యామిని, చిత్తూరు

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జ1
1/5

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జ

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జ2
2/5

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జ

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జ3
3/5

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జ

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జ4
4/5

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జ

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జ5
5/5

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement