పోలీసు గ్రీవెన్స్‌కు 36 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

పోలీసు గ్రీవెన్స్‌కు 36 ఫిర్యాదులు

Feb 17 2026 7:47 AM | Updated on Feb 17 2026 7:47 AM

పోలీసు గ్రీవెన్స్‌కు 36 ఫిర్యాదులు

పోలీసు గ్రీవెన్స్‌కు 36 ఫిర్యాదులు

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలోని ఏఆర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ఎస్పీ తుషార్‌ డూడీ ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. మొత్తం 36 ఫిర్యాదులు వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసా లు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీ లకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్‌లైన్‌ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూ డాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. పలువురు స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్లతో వీడియో కాల్స్‌ ద్వారా సమస్యలపై చర్చించారు. ఏఎస్పీరాజశేఖర్‌ రాజు సైతం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

నేడు కరెంటోళ్ల జనబాట

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్‌ తెలిపారు. జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమో దు చేసుకుంటారని పేర్కొన్నారు. వాటిని దశలవారీగా పరిష్కారించనున్నట్లు వెల్లడించారు.

విద్యుత్‌ సమస్యల

పరిష్కారానికి కృషి

చిత్తూరు కార్పొరేషన్‌: విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌ అహ్మద్‌ తెలిపారు. సోమవారం ఎస్‌ఈ కార్యాలయంలో డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అరగొండలో అదనపు సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయాలని వినియోగదారుడు కోరారు. అదే విధంగా చిత్తూరు అర్బన్‌ డివిజన్‌ పరిధిలో విద్యుత్‌ లైన్‌ మార్పు చేయాలని ఇద్దరు వినియోగదారులు సమస్య ను తెలియజేశారు. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారించాలని ఎస్‌ఈ అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్‌ వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం

చిత్తూరు కలెక్టరేట్‌ : తమ భూ సమస్యపై గ్రా మస్తులంతా ఏకమై దౌర్జన్యం చేస్తున్నారని జీడీనెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం, పచ్చికాపల్లానికి చెందిన సాయికుమార్‌ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. పీజీఆర్‌ఎస్‌కు విచ్చేసిన బాధితుడు, తన తండ్రి పురుషోత్తంరెడ్డి, ఇతర అర్జీదారుల సమక్షంలోనే ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. పోలీసులు గమనించి బాధితుడిపై నీటిని పోసి అడ్డుకున్నా రు. ఈ ఘటనపై జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రా జేంద్రన్‌ స్పందించారు. విచారణ చేయాలని రెవె న్యూ అధికారులను ఆదేశించారు. అనంతరం బాధితుడు సాయికుమార్‌ విలేకరులతో మాట్లాడారు.గ్రామంలో సర్వే నం.204లో దాదాపు 2.48 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపారు. తమ భూమి లో 15 అడుగుల వరకు ఆక్ర మించుకునేందుకు స్థానికులు యత్నిస్తున్నట్టు ఆరోపించారు. సమస్యపై ఇప్పటికి మూడు సార్లు తహసీల్దార్‌, సర్వే యర్‌, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి న్యాయం జరగలేదన్నారు. న్యాయం చేయాలని బాధితుడితోపాటు ఆయన తండ్రి అభ్యర్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement