నమో..భూతనాథ | - | Sakshi
Sakshi News home page

నమో..భూతనాథ

Feb 13 2026 3:35 AM | Updated on Feb 13 2026 3:35 AM

నమో..

నమో..భూతనాథ

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి భూతవాహనంపై ముక్కంటీశుడు, శుకవాహనం జ్ఞానప్రసూనాంబ ఊరేగారు. ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై, అమ్మవారు చప్పరంపై భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యప్రభ వాహనంపై పరమశివుడు సర్వాలంకార శోభితుడై విహరిస్తుండగా మూషిక వాహనంపై వినాయకస్వామి, శ్రీవళ్లి, దేవసేన సమేత కుమారస్వామి, చండికేశ్వరుడు, భక్తన్నప్ప చప్పరాలపై స్వామి అమ్మవార్ల వెంట అనుసరించారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, కోలాటాలు, భజన బృందాలు, భక్తులు శంఖం ఊదుతూ వెళుతుండా స్వామిఅమ్మవార్ల పురవిహారం చేశారు. పురవీధుల్లో ఊరేగుతున్న స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్‌, కొట్టేసాయి, ఈఓ బాపిరెడ్డి, పాలకమండలి సభ్యులు, ఆలయాధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు యాప్‌లలో డేటా ఎంట్రీలు, సర్వేలే సరిపోతున్నాయి. సెలవు అడిగితే మెమోలు ఇస్తున్నారు. మా తోటి మిత్రులు మానసిక ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం సర్వేలు పూర్తి చేయండి అని ఆర్డర్లు వేస్తోంది తప్ప, మా ప్రాణాలకు విలువనివ్వడం లేదు.

– కుప్పం నియోజకవర్గంలోని వార్డు కార్యదర్శి అనిల్‌ ఆక్రోశం

మేము ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా మారాం. కానీ ప్రస్తుతం ఒత్తిడితో కుంగిపోతున్నాం. సచివాలయ ఉద్యోగుల పై ఒత్తిడి పెంచి ఆత్మహత్యలకు కారణమవుతున్న చంద్రబాబు సర్కారు పై సమ్మెకు సిద్ధపడుతున్నాం. చేపట్టబోయే సమ్మె తోటి ఉద్యోగుల ప్రాణాలను కాపాడుకోవడానికి చేసే అస్తిత్వ పోరాటం.

– చిత్తూరు నగరంలోని సచివాలయ ఉద్యోగి రమేష్‌ ఆవేదన

బ్రహ్మోత్సవాల్లో నేడు

మూడో తిరునాళ్లు: గాంధర్వ రాత్రి (మాఘ బహుళ ఏకాదశి)

వాహన సేవలు

ఉదయం 9గంటలకు: హంస–యాళి వాహనసేవ

ఉభయదాతలు: కీ.శే. చిట్టాప్రగడ సీతారామంజనేయుడు, గుడివాడ, కృష్ణాజిల్లా

రాత్రి 8గంటలకు రావణుడు – మయూర వాహనసేవ

ఉభయదాతలు : జూలుగంటి సుబ్బారావు, నాగలక్ష్మి శ్రీకాళహస్తి

నమో..భూతనాథ1
1/1

నమో..భూతనాథ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement