దందా ఖనిజం!
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
చిత్తూరు అడ్డాగా గ్రానైట్ దందా
సాక్షి, టాస్క్‌ఫోర్స్: జిల్లాలో 400 వరకు గ్రానైట్ క్వారీలున్నాయి. ఇందులో 150 వరకు అనధికారికంగా నడుస్తున్నాయి. మరో 100 క్వారీలు అక్ర మార్కుల చేతిల్లో గుల్లవుతున్నాయి. పలు క్వారీల్లో అక్రమ గ్రానైట్ తరలింపు పుంజుకుంటోంది. శ్రీరంగరాజుపురం, జీడీనెల్లూరు, యాదమరి, బంగారుపాళ్యం మండలాల్లో అక్రమ గ్రానైట్ తవ్వకాలతో పాటు తరలింపులకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అనుమతులు లేకుండానే తవ్వకాలు, రాయల్టీ లేకుండానే తరలింపులు చేస్తున్నారు. రోజుకు కోట్లాది రూపాయల విలువైన గ్రానైట్ చిత్తూరు మీదుగా ఇతర ప్రాంతాలకు తరలిపోతోంది. శ్రీరంగరాజుపురం, జీడీనెల్లూరు మీదు గా చిత్తూరుకు తరలించేస్తున్నారు. అలాగే చిత్తూరు మండలం, ముత్తుకూరు వద్ద ఉన్న తచ్చూరు హైవే ను అక్రమ మార్గంగా ఎంచుకున్నారు. ఈ మార్గం గుండా కోట్లాది రూపాయల విలువచేసే గ్రానైట్ దిమ్మెలు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
‘రాయల్’గా దోపిడీ!
రాయల్టీ వసూళ్ల విషయమైతే మరీ దారుణంగా తయారైంది. అడిగితే ‘టెండర్లు జరగలేదు’ అని నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. కానీ వందల లారీలు, రాయల్టీ ఎవరి జేబుల్లోకి వెళ్తోంది? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లు వెళ్లిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తనిఖీలు ఉన్నాయా? లేక కాగితాలకే పరిమితమా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. ఒక క్యూబీ మీటర్‌కు కేంద్ర, రాష్ట్ర జీఎస్టీలు కలిపి రూ.2,500 నుంచి రూ.2,700 వరకు కట్టాల్సి ఉంటుంది. ఈ లెక్క ప్రకారం మైనింగ్ శాఖ అధికారులే వసూలు చేయాలి. కానీ ఆ రకంగా అధికాారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో అక్రమ గ్రానైట్ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. చట్టాలు, నిబంధనలన్నీ కూటమి నేతలు గాలికి వదిలేశారు. గ్రానైట్ దిమ్మెల దోపిడీలో ఆరితేరిపోయారు. రాయల్టీకి పంగనామాలు పెట్టేస్తున్నారు. బడా నేతల అండతో అధికారులు కూడా చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. కాదని పట్టుకుంటే.. అధికార పార్టీ నేతలు జులుం ప్రదర్శిస్తున్నారు. గ్రానైట్ దందాపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్..
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 81,894 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,754 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.,91 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. సర్వదర్శనం భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
అధికారులకు గుది‘బండ’!
నిబంధనల ప్రకారం గ్రానైట్ దిమ్మె తరలించాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి. ప్రతి మీటర్‌కు రాయల్టీ చెల్లించాలి. కానీ పలు మండలాల్లో మాత్రం మాఫియా చట్టాన్ని తుంగలో తొక్కేస్తోంది. జీడీనెల్లూరులో ఓ ప్రజాప్రతినిధి అండతో రాజస్థాన్‌కు చెందిన ఓ బడా వ్యాపారి రాయల్టీ కట్టకుండా దోచేస్తున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే మాదిరిగానే బంగారుపాళ్యం, యాదమరి, చిత్తూరులో కూడా బడా నేతలు రాయల్టీలకు డుమ్మా కొడుతున్నారు. వీటిపై అధికారులు పట్టించుకుంటే వారికి బెదిరింపులు వస్తున్నాయని కొందరు అధికారులు వాపోతున్నారు. దీంతో పట్టుకున్న బండ్లను కూడా వదిలేయాల్సి వస్తోందని చెబుతున్నారు. మూడు రోజుల క్రితం జీడీనెల్లూరులో బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఓ గ్రానైట్ లారీని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. అయితే దీన్ని అధికార పార్టీ నేతల ఒత్తిడితో వదిలేశారని.. పలువురు భగ్గుమంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ గ్రానైట్ దందాపై ఉక్కుపాదం మోపకపోతే చిత్తూరు ఖనిజ సంపద పూర్తిగా దోచుకుపోయే ప్రమాదం ఉందన్న హెచ్చరిస్తున్నారు.


