కల్తీని కడిగేద్దాం! | - | Sakshi
Sakshi News home page

కల్తీని కడిగేద్దాం!

Feb 9 2026 7:41 AM | Updated on Feb 9 2026 7:41 AM

కల్తీ

కల్తీని కడిగేద్దాం!

● ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకే చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ ● శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చేసిన తప్పులను కప్పిపుచ్చకోవడానికి నానాయాతన ● తిరుపతిలో రోడ్లను పసుపు నీళ్లతో శుభ్రం చేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు

కూటమి పాపాలపై

ఆ దేవదేవుడే శిక్షిస్తాడు

తిరుపతి మంగళం : శ్రీవారి లడ్డూ ప్రసాదం చేసే నెయ్యిలో కల్తీ జరగలేదని, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ మనసులే కల్తీ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే.అజయ్‌కుమార్‌, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ యచ్చం వాసుయాదవ్‌ ధ్వజమెత్తారు. లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తూ తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ ఆలయం నుంచి అలిపిరి వరకు కూటమి నాయకులు అపవిత్రం చేస్తూ నడిచిన రోడ్లను ఆదివారం వైఎస్సార్‌సీపీ శ్రేణులు, మహిళలు పసుపు నీళ్లతో శుభ్రం చేశారు. పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మభ్యపెట్టేందుకే శ్రీవారి లడ్డూ ప్రసాదంతో నీచ రాజకీయం చేస్తూ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక శ్రీవారి ప్రతిష్టను దిగజారుస్తూ, శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నా రని ధ్వజమెత్తారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్‌, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గీతాయాదవ్‌ మాట్లాడుతూ తిరుపతి పుణ్య క్షేత్రంలో జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుతో పాటు కూటమి నాయకులు పసుపు బట్టలు ధరించి దొంగ దీక్షలతో పాదయాత్ర చేపట్టి నెయ్యిలో కల్తీ చేశారంటూ నమ్మబలికించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ లడ్డూ భాస్కర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు పుల్లయ్య, తలారి రాజేంద్ర, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌వంశీ, దినేష్‌రాయల్‌, పార్టీ సీనియర్‌ నాయకులు తుడా వెంకటరెడ్డి, నాయకులు రాజేష్‌, కడపగుంట అమరఽనాఽథ్‌రెడ్డి, చంద్రయ్య, వెంకటేష్‌రాయల్‌, కోటి, స్వరూప్‌, ఆటో ప్రసాద్‌, బాలాజీ, ధనశేఖర్‌, విజయలక్ష్మి, పద్మజ, శాంతారెడ్డి, పుణీత, పుష్పాలత, యశోద, పావని తదితరులు పాల్గొన్నారు.

కల్తీని కడిగేద్దాం!1
1/1

కల్తీని కడిగేద్దాం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement