క్రమబద్ధకం!
చిత్తూరులో బీపీఎస్ పరిధిలోకి వచ్చే భవనాలకు మార్కింగ్ చేస్తున్న సిబ్బంది
ఆదాయం పట్టించుకోరా?
1995 జనవరి 1వ తేదీ నుంచి 2025 ఆగస్టు 31వ తేదీ వరకు జరిగిన భవనాల నిర్మాణంలో మునిసిపాలిటీల నుంచి తీసుకున్న ప్లాన్ ప్రకారం కాకుండా అతిక్రమణలు జరిగిన భవనాలు, అసలు ప్లాన్ అప్రూవల్స్ లేకుండా నిర్మించిన కట్టడాలను క్రమబద్ధీకరించుకోవడానికి గతేడాది నవంబర్‌లో బీపీఎస్ పథకాన్ని తీసుకొచ్చారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ ఏడాది మార్చి 11వ వరకు గడువు విధించారు. అంతంత మాత్రంగా ఉన్న పట్టణ స్థానిక సంస్థల (యూఎల్‌బీ) ఆర్థిక పరిస్థితి బీపీఎస్‌తో కాస్త ఆర్థిక పరిపుష్టి లభించనుంది. కానీ కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంతో ఖజానాకు జమకావాల్సిన రూ.కోట్ల నిధులు రాకుండా చేజారే ప్రమాదం ఉంది.
90 శాతం అక్రమాలే..
జిల్లాలోని నగరాలు, పట్టణాల్లో నిర్మించే ప్రతి వంద మందిలో 80 మంది ప్లాన్ అప్రూవల్స్ తీసు కుంటే.. 20 శాతం మంది అనుమతులు తీసుకోరు. ఇక ప్లాన్ అప్రూవల్ తీసుకున్న 80 శాతంలో 90 శాతం మంది నిబంధనలను అతిక్రమిస్తూ నిర్మాణాలు చేపడుతుంటారు. వీరంతా కూడా బీపీఎస్ పరిధిలోకి రావాల్సిందే. పైగా అక్రమాలను నామమాత్రపు చార్జీలతో సక్రమం చేసుకునే వెలుసు బాటు బీపీఎస్‌లో ఉండడం వల్ల భవన యజమానికి మేలే జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రజలకు వివరించి, దరఖాస్తు చేసుకునేలా చేయడంలో యంత్రాంగం వైఫల్యం చెందుతోంది.
జిల్లాలో బీపీఎస్ దరఖాస్తులు ఇలా..
మునిసిపాలిటీ దరఖాస్తులు
చిత్తూరు 208
పలమనేరు 16
నగరి 40
కుప్పం 19
మేల్కొంటారా?
2015లో బీపీఎస్ ఇచ్చినప్పుడు జిల్లా మొత్తంలో 14వేల వరకు దర ఖాస్తులురాగా, దాదాపు రూ.12 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. 2019లో రెండు వేల దరఖాస్తులు వస్తే రూ.9 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. తాజాగా జిల్లాలో ఇప్పటి వరకు 300 దరఖాస్తులు కూడా రాలేదు. తాజా నోటిఫికేషన్‌లో బీపీఎస్ ద్వారా రూ.10 కోట్లకు పైగా ఆదాయం రావాల్సింది. కానీ జిల్లా వ్యాప్తంగా భవనాల నుంచి కేవలం 332 దరఖాస్తులు అందితే.. ఇందులో చిత్తూరు కార్పొరేషన్‌దే 200లకు పైగా ఉన్నాయి. మిగిలిన మూడు మునిసిపాలిటీలకు కలిపి వంద దరఖాస్తులు కూడా అందకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. పలమనేరు, కుప్పం మునిసిపాటీల్లో 16,19 దరఖాస్తులు రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికై నా మునిసిపల్ అధికారులు కాస్త గట్టి ప్రయత్నం చేస్తే బీపీఎస్ కాసులు కురిపించే కల్పవృక్షం కానుంది.
క్రమబద్ధకం!


