ఆకాశాన్ని అంటుతున్న వంట నూనె ధరలు
వేరుశనగ పప్పుకిలో రూ.200
వేరుశనగ గింజల ధర ఒక్కసారిగా పెరగడంతో వంట నూనె ధరలకు రెక్కలొచ్చినట్టు చెబుతున్నా రు. వారం రోజుల క్రితం వరకు కిలో వేరుశనగ గింజలు రూ.130 నుంచి రూ.140 ఉండగా ప్రస్తుతం రూ.200 వరకు విక్రయిస్తున్నారు. రబీ పంటలు చేతికి వచ్చే వరకు ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నిత్యావసరాల ధరలు అదుపు తప్పుతున్నాయి. అనేక హామీలతో అధికారాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం సామాన్యులకు ఏ మాత్రం ఊరటనివ్వలేకపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యావసరాల ధరల నియంత్రణలో ప్రభుత్వం చేతులెత్తేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకో ప్రచారంతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు జరుగుతుండగా మరోవైపు బహిరంగ మార్కెట్లో ధరలు సలసలకాగుతున్నాయి. సామాన్యుడి వంటింటి బడ్జెట్ పూర్తిగా మారిపోతోంది.
– చిత్తూరు రూరల్ (కాణిపాకం)
జేబులకు చిల్లు
కొన్ని కంపెనీలు లీటరు 900 గ్రాముల పేరుతో 850 గ్రాములు, 800 గ్రాముల ప్యాకెట్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. వినియోగదారులు ధర మాత్రమే చూసి పరిమాణాన్ని గమనించకపోవడంతో మోసపోతున్నారు. వంట నూనెతో పాటు పప్పులు, మసాలా దినుసుల ధరలు సైతం అనూహ్యంగా పెరిగాయి. కంది పప్పు రూ.110 నుంచి రూ.130కి, ఎండుమిర్చి కిలో రూ.240 నుంచి రూ.300కి, మినపప్పు కిలోకు రూ.20 మేర పెరిగింది. పండుగల సీజన్ లేకపోయినా ధరలు ఇలా పెరగడంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అబద్ధపు ప్రచారాలు, రాజకీయ విమర్శలు పక్కనబెట్టి ప్రభుత్వం ధరల నియంత్రణ, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించాలని మేధావులు, ప్రజలు కోరుతున్నారు.
ధరల కట్టడి చేయాలి
నిత్యావసర సరుకులు పెరుగుదలతో సామాన్య జనం ఇబ్బంది పడుతున్నారు. నెల వారీ సరుకు కొనాలంటే కనీసం రూ.3వేల వరకు ఖర్చువుతోంది. కూరగాయలు, ఇతరాత్ర అధనం. ఇలా ఇంటి అవసరాలకే నెలకు రూ. 5వేల వరకు ఖర్చువుతోంది. వచ్చే జీతం తినే తిండికి సరిపోయేటట్టు ఉంది.
– నవమణి, చిత్తూరు
ఆకాశాన్ని అంటుతున్న వంట నూనె ధరలు
ఆకాశాన్ని అంటుతున్న వంట నూనె ధరలు


