దాతలకు దక్కని గౌరవం! | - | Sakshi
Sakshi News home page

దాతలకు దక్కని గౌరవం!

Feb 10 2026 7:40 AM | Updated on Feb 10 2026 7:40 AM

దాతలక

దాతలకు దక్కని గౌరవం!

● పేరు మూసివేస్తే సేవ మాయం అవుతుందా? ● ఆస్పత్రిలో పేషెంట్‌ వెయిటింగ్‌ చైర్లపై దాత ఆర్‌కే రోజా పేరు మూసివేత

నగరి: ఆస్పత్రిలో రోగుల సౌకర్యార్థం మాజీ మంత్రి ఆర్కే రోజా తన చారిటబుల్‌ ట్రస్టు ద్వారా ఏర్పాటు చేసిన వెయిటింగ్‌ చైర్లపై ఉన్న ఆమె పేరు మూసివేయడం తీవ్ర వివాదానికి దారి తీస్తోంది. దాత ఆర్‌కే రోజా పేరును ఉద్దేశపూర్వకంగా కప్పివేయడం దాతృత్వానికి అవమానమని పలువురు ఆరోపిస్తున్నారు. నగరి ఏరియా ఆస్పత్రిలో కమిటీ సభ్యులు, వైద్యాధికారులు చేసిన ఈ చర్యపై స్థానికులు, సామాజిక కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఆస్పత్రి అభివృద్ధికి సహకరించిన వారిని గౌరవించాల్సిన బాధ్యత అధికారులదే.. పేరు మూసివేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో చెప్పాలని’’ పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆస్పత్రి అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు మరింత ఊతమిస్తోంది. దాతలకు తగిన గౌరవం ఇవ్వకపోతే ఎలా అనిమేధావులు హెచ్చరిస్తున్నారు.

దాతలకు దక్కని గౌరవం! 1
1/1

దాతలకు దక్కని గౌరవం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement