వరిపై జంట ఏనుగుల దాడి | - | Sakshi
Sakshi News home page

వరిపై జంట ఏనుగుల దాడి

Feb 10 2026 7:30 AM | Updated on Feb 10 2026 7:30 AM

వరిపై

వరిపై జంట ఏనుగుల దాడి

ఐరాల: వరి పంటపై జంట ఏనుగులు దాడి చేసిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మండలంలోని చిగరపల్లె గ్రామానికి చెందిన ఉదయగిరి వరి పైరు తొక్కి నాశనం చేశాయి. అదే గ్రామానికి చెందిన మరో రైతు మామిడి తోటకు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను ధ్వంసం చేశాయి. సుమారు రూ.20 వేల వర కు నష్టం వాటిల్లిందని బాధిత రైతులు తెలిపా రు. చిత్తూరు డీఆర్‌ఓ కరణ్‌సింగ్‌ జంట ఏనుగు లు తొక్కి నాశనం చేసిన వరి పంటను పరిశీలించారు. నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులు రాత్రి పూట ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లరాదని సూచించారు. ప్రస్తుతం జంట ఏనుగులు తవణంపల్లె మండలం వైపు వెళ్లినట్లు చెప్పారు. ఎఫ్‌బీఓ రెడ్డెప్ప, ఏబీఓ ఉదయ్‌ పాల్గొన్నారు.

3,477 మంది

విద్యార్థులకు కళ్లద్దాలు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లాలోని 3,477 మంది విద్యార్థులకు కళ్లద్దాలు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్‌ అర్పిత తెలిపారు. సోమవారం చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని 500 పాఠశాలల్లో మొత్తం 57,561 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించామన్నారు. 16 మంది కంటి వైద్యులు ఈ పరీక్షల్లో పాల్గొనగా, అందులో 3,477 మందికి కళ్లద్దాలు అవసరమని గుర్తించామన్నారు. ఇప్పటివరకు వెయ్యి మంది విద్యార్థులకు కళ్లద్దాలు అందజేశామని, మిగిలిన వారికి త్వరలోనే పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

క్యాబ్‌ బుకింగ్‌లో డ్రోన్‌ సేవలు

చిత్తూరు కలెక్టరేట్‌ : వ్యవసాయరంగంలో ఆధునిక సాంకేతికతను మరింత విస్తృతంగా రైతులకు అందించేందుకు కిసాన్‌ డ్రోన్స్‌ సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో క్యాబ్‌ బుకింగ్‌ ద్వారా డ్రోన్‌ సేవలు పోస్ట ర్లను ఆవిష్కరించారు. జేసీ మాట్లాడుతూ ఈ డ్రోన్‌ సేవలు రైతులకు ఎంతో ఉపయోగకరమన్నారు. పురుగు మందులు, ఎరువులు, విత్తనాలను డ్రోన్‌తో పిచికారీ చేయవచ్చన్నారు. ఈ అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ నరేంద్ర పడాల్‌, డీఆర్‌వో మోహన్‌కుమార్‌, వ్యవసాయ శాఖ అధికారి మురళి పాల్గొన్నారు.

వరిపై జంట ఏనుగుల దాడి 
1
1/1

వరిపై జంట ఏనుగుల దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement