గుండె మంటలు.. ఆకలి కేకలు! | - | Sakshi
Sakshi News home page

గుండె మంటలు.. ఆకలి కేకలు!

Feb 10 2026 7:40 AM | Updated on Feb 10 2026 7:40 AM

గుండె

గుండె మంటలు.. ఆకలి కేకలు!

తిరుపతి జిల్లా, కపిలతీర్థం సమీపంలోని శివజ్యోతి నగర్‌ వద్ద ఉన్న ప్రభుత్వ అంధుల శరణాయంలోని బధిరులు సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌కు విచ్చేసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీకి సమస్యలను విన్నవించుకున్నారు. చూపు లేదు.. కానీ గుండె నిండా ఆవేదన ఉంది.. అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వ అంధుల శరణాలయంలో నిలువ నీడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వినోద్‌ వేధింపులు భరించలేక పోతున్నామని వాపోయారు. అంధుల శరణాలయం నుంచి విచ్చేసిన మర్రిపూడి నాగేశ్వరరావు మాట్లాడుతూ శ్రీఅయ్యా మాకు చూపు లేదు.. ఏడీ వినోద్‌కుమార్‌కు మేమంటే ఇంత అలుసా..?శ్రీ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే దిక్కెవరు అని ప్రశ్నించారు. ఏడీ తమ పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్నారని, శరణాలయంలో సమయానికి భోజనం కూడా పెట్టడం లేదన్నారు. ఏమి అడిగినా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ప్రశ్నిస్తే మానసిక వేధింపులు, బెదిరింపులే సమాధానంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మీరే న్యాయం చేయాలంటూ కలెక్టర్‌ను ప్రాధేయపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు అందులు పాల్గొన్నారు.

– చిత్తూరు కలెక్టరేట్‌

పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు సమస్యను విన్నవించేందుకు వెళ్తున్న దివ్యాంగులు

ఏడీ వేధింపుల నుంచి కాపాడాలని కన్నీరు మున్నీరవుతున్న దివ్యాంగులు

గుండె మంటలు.. ఆకలి కేకలు!1
1/1

గుండె మంటలు.. ఆకలి కేకలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement