సమస్యలు అనేకం..నీరుగారుతున్న లక్ష్యం!
క్షేత్రస్థాయిలో పట్టించుకోని అధికారులు
వివిధ సమస్యలపై 115 అర్జీల నమోదు
అర్జీలు స్వీకరించిన కలెక్టర్,
జాయింట్ కలెక్టర్
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యలు క్షేత్ర స్థాయిలో పరిష్కారానికి నోచుకోవడం లేదు. తమకు న్యాయం చేయాలంటూ ప్రతి సోమవారం జిల్లాలోని కుప్పం, పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు, నగరి, జీడీ నెల్లూరు నియోజకవర్గాల నుంచి బాధితులు పీజీఆర్‌ఎస్‌కు విచ్చేస్తూనే ఉన్నారు. ఉన్నతాధికారులకు అర్జీలు అందజేస్తూనే ఉన్నారు. ప్రజల చెంతకే పాలన అంటూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు, కలెక్టరేట్ గోడల మధ్యే ఆవిరైపోతున్నాయి. అధికారులు అర్జీలు స్వీకరిస్తున్నారు తప్ప, వాటికి విముక్తి కల్పించడం లేదని క్షేత్ర స్థాయిలో విమర్శలు గుప్పుమంటున్నాయి.
115 అర్జీలు నమోదు
సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహించారు.కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్, డీఆర్‌వో మోహన్‌కుమార్‌లు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చే ప్రతి అర్జీకి న్యాయం చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. వివిధ సమస్యలపై సోమవారం 115 అర్జీలు నమోదైనట్లు కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి క్షేత్ర స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
పలు ప్రాంతాల నుంచి పీజీఆర్‌ఎస్‌కు విచ్చేసిన అర్జీదారులు
సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్న అర్జీదారులు
పీజీఆర్‌ఎస్‌కు
క్యూ కడుతున్న అర్జీదారులు
సమస్యలు అనేకం..నీరుగారుతున్న లక్ష్యం!


