దందాకి గైడెన్సీ!
చిత్తూరు కలెక్టరేట్ : ఒక్కప్పుడు ప్రభుత్వ బడి అంటే పేదవాడికి దక్కిన గొప్పవరం అని భావించేవారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు సర్కారులో జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలు అక్షర క్షేత్రంలో అక్రమదందా సాగిస్తున్నారు. జిల్లాలోని 80 శాతానికి పైగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు కమీషన్లకు నిలయంగా మారుతున్నాయి. ప్రభుత్వం కోట్ల రూపాయాల ప్రజాధనంతో ఉచితంగా పాఠ్యపుస్త కాలను పంపిణీ చేస్తోంది. అయితే కొందరు టీచర్లు మాత్రం ప్రైవేట్ గైడ్ల కోసం విద్యార్థుల జేబులకు తూట్లు పెడుతున్నారు.
విద్యాశాఖ వైఫల్యం
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ దందా బహిరంగంగా సాగుతున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల అధికారులు మౌనం వహిస్తున్నా రు. రాబోయే విద్యాసంవత్సరానికి ఇప్పటి నుంచే పలు ప్రైవేట్ పబ్లిషర్‌లు దందా మొదలుపెట్టారు. ఈ దందా మొత్తం విద్యాశాఖ అధికారులకు తెలిసినా మౌనం వహించడం వెనుక భారీ మర్మమే ఉందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు టీచర్లు గైడ్లను దాచి పెడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పుస్తకాల అమ్మకం నిషేధమనే రూల్‌ను తుంగలో తొక్కేశారు.
.. ఇది ఒక్క జీడీనెల్లూరులోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉన్నత పాఠశాలల్లో సాగుతున్న గైడ్ల దందా ఇది. అక్కడి హెచ్‌ఎంల అండదండలతో ఉపాధ్యాయులు ప్రయివేటు పబ్లిషర్‌తో కుమ్మకై గైడ్ల సంస్కృతికి బీజం వేశారు. సృజనకు తాళం వేసి.. బట్టీ విధానానికి శ్రీకారం చుడుతున్నారు. దీనిపై తల్లిదండ్రులు, మేధావులు రగిలిపోతున్నారు.
జిల్లా సమాచారం
నియోజకవర్గం ప్రభుత్వ విద్యార్థుల
హైస్కూళ్లు సంఖ్య చిత్తూరు 32 7,384
గంగాధరనెల్లూరు 49 8,675
కుప్పం 88 18,516
నగరి 25 5,756
పలమనేరు 84 19,005
పూతలపట్టు 48 9,178
వ్యాపార కేంద్రాలుగా బడులు
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను చంద్రబాబు ప్రభుత్వం వ్యాపార కేంద్రాలుగా మార్చేసింది. కొన్ని చోట్ల ఎంఈవోలకు సైతం పబ్లిషర్‌ల నుంచి నజరానాలు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో గైడ్ల తతంగం బహిరంగంగా జరుగుతున్నా, ఏ ఒక్క ఉపాధ్యాయుడిపై విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్థం కావడం లేదు.
గైడ్లల్లో ఏముంది?
ఉపాధ్యాయులు బోధన మానేసి గైడ్‌ల సేల్స్‌మెన్స్‌లాగా వ్యవహరించడం దారుణం. జిల్లాలో పేద విద్యార్థులను అప్పులపాలు చేస్తున్న ఈ గైడ్ల మాఫియాపై సమగ్ర విచారణ నిర్వహించాలి. కలెక్టర్ ఈ గైడ్ల దందా పట్ల ప్రత్యేక టీంలతో సమగ్రంగా విచారణ చేయించాలి. లేదంటే డీఈవో కార్యాలయం ముట్టడిస్తాం.
– ప్రవీణ్‌కుమార్,
ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి.
చర్యలు కఠినంగా ఉంటాయ్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల వద్ద గైడ్‌లు కనిపిస్తే చర్యలు కఠినంగా ఉంటాయి. నేను పాఠశాలలను ఆకస్మికంగా చేసే తనిఖీల్లో విద్యార్థుల వద్ద గైడ్లు ఉన్నట్లు కనిపిస్తే సంబంధిత టీచర్‌తో పాటు హెచ్‌ఎం పై సైతం శాఖాపరమైన చర్యలు తీసుకుంటా. ప్రైవేట్ పబ్లిషర్స్‌తో కలిసి విద్యార్థులను గైడ్లు కొనుగోలు చేయాలని టీచర్లు ఒత్తిడి చేస్తే వెంటనే నాకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయండి. – రాజేంద్రప్రసాద్, డీఈవో,
చిత్తూరు జిల్లా
దందాకి గైడెన్సీ!
దందాకి గైడెన్సీ!


