పరమేశ్వరుని దివ్యతేజం | - | Sakshi
Sakshi News home page

పరమేశ్వరుని దివ్యతేజం

Feb 15 2026 7:27 AM | Updated on Feb 15 2026 7:27 AM

పరమేశ

పరమేశ్వరుని దివ్యతేజం

బంగారుపాళెం: మొగిలి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజు శనివారం ఉదయం శ్రీమొగిలీశ్వరస్వామి, కామాక్షమ్మ వారు అధికార నంది వాహనాన్ని అధిరోహించి భక్తాదులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. అలంకార మండపంలో ఉత్సవమూర్తులను వివిధ రకాల పుష్పాలతో అలంకరించా రు. అనంతరం నంది వాహనంపై కొలువుదీర్చి మేళతాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఘనంగా ఊరేగించారు. ఉత్సవ కార్యక్రమానికి గాండ్లపల్లె గ్రామానికి చెందిన సాంబశివనాయుడు, ఆయన సోదరులు ఉభయదారులుగా వ్యవహరించారు. రాత్రి ఆదిశంకరుడై న మొగిలీశ్వరస్వామి, కామాక్షమ్మవారు సింహ వాహనంపై భక్తులను కనువిందు చేశారు. సింహవాహన ఉత్సవానికి బంగారుపాళ్యానికి చెందిన ఉషోదయా పాఠశాల యాజమాన్యం భారతి, ప్రతాప్‌ చంద్రనాయుడు ఉభయదారులుగా వ్యవహరించారు.

నేటి వాహన సేవలు

బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం మహాశివరాత్రి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ అభిషేకం, వృషభ వాహన సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఈఓ మునిరాజ తెలిపారు.

వృద్ధురాలు అదృశ్యం

ఐరాల: వృద్ధురాలు అదృశ్యమైన ఘటనపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జయశ్రీ తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు.. మండలంలోని నాంపల్లెకు చెందిన వెంకటరామానాయుడి భార్య మంగమ్మ(80) ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి వెళ్లింది. అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాలేదు. చుట్టు పక్కల, సమీప బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె భర్త ఫిర్యాదు మేరకు అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

పరమేశ్వరుని దివ్యతేజం 
1
1/1

పరమేశ్వరుని దివ్యతేజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement