పదో తరగతి యాక్షన్‌ప్లాన్‌ను పాటించాలి | - | Sakshi
Sakshi News home page

పదో తరగతి యాక్షన్‌ప్లాన్‌ను పాటించాలి

Feb 15 2026 7:27 AM | Updated on Feb 15 2026 7:27 AM

పదో త

పదో తరగతి యాక్షన్‌ప్లాన్‌ను పాటించాలి

– IIలో

– IIలో

న్యూస్‌రీల్‌

ప్రకటనల ఆర్భాటం.. ఆచరణ లోటు

కుప్పంకు కాసులు.. జిల్లాకు కన్నీళ్లు

చిత్తూరును ముంచిన బాబు సర్కార్‌

వాస్తవం తక్కువ.. ఆర్భాటం ఎక్కువ

ఉద్యోగుల ఆశలపై నీళ్లు

బడ్జెట్‌పై జిల్లావాసుల అసంతృప్తి

పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని పలమనేరులో డీఈఓ రాజేంద్రప్రసాద్‌ సూచించారు.

ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

చంద్రబాబు ప్రభుత్వం నిన్నటి రోజున ప్రవేశపెట్టిన బడ్జెట్‌ చిత్తూరు జిల్లావాసులను నిట్టనిలువునా వంచించింది. కుప్పం చుట్టూనే రాజకీయం తిప్పుతూ, జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలను గాలికి వదిలేశారు. అంకెల్లో చూపిన వేల కోట్ల పెట్టుబడులు కేవలం ప్రచారానికే పరిమితమని, సామాన్యుడి బతుకుల్లో ఎలాంటి మార్పు రాబోదని జిల్లాలోని విశ్లేషకులు మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ధనికులకు వరం... సామాన్యుడికి శాపంగా మారింది. ఉద్యోగుల కడుపు కొట్టి, రైతుల కళ్లల్లో మట్టి కొట్టి, కేవలం పారిశ్రామికవేత్తల ప్రయోజనాలకు పెద్దపీట వేశారని స్పష్టమైంది. రాబోయే రోజుల్లో ప్రస్తుత సర్కారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని జిల్లావాసులు మండిపడుతున్నారు.

నారా గారడీ

చిత్తూరు కలెక్టరేట్‌: చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రస్తుత బడ్జెట్‌ చిత్తూరు జిల్లా పాలిట అంకెల గారడీగా మారింది. పారిశ్రామిక హబ్‌లు, హైవేల పేరుతో భారీ అంకెలను చూపిన ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గాలికి వదిలేసింది. ముఖ్యంగా జిల్లాలోని ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగులకు ఈ బడ్జెట్‌ మొండిచేయి చూపింది. జిల్లా అంతటా ఒక్క కుప్పం తప్ప మిగిలిన ప్రాంతాలు మ్యాప్‌లోనే లేవన్నట్టుగా వ్యవహరించడంపై ప్రజలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.

ప్రకటనల హోరు

కుప్పం నియోజకవర్గానికి రూ.6,339 కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం చెబుతున్నా, గతంలో శంకుస్థాపన చేసిన పరిశ్రమలే ఇంకా పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. బడ్జెట్‌లో చూపి న కేటాయింపులన్నీ కేవలం కుప్పం నియోజకవర్గం చుట్టూనే తిరుగుతున్నాయి. పెట్టుబడుల పేరుతో కుప్పం రైతుల నుంచి వేల ఎకరాల భూములను సేకరించి కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పలమనే రు, పూతలపట్టు, నగరి, జీడీ నెల్లూరు, చిత్తూరు ప్రాంతాల్లో కనీస సాగునీటి సౌకర్యాలు కల్పించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాలను విస్మరించి కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌కే నిధులు మళ్లించడం ప్రాంతీయ వివక్షతకు పరాకాష్ట అని ప్రజలు మండిపడుతున్నారు.

ఉద్యోగులకు తీరని అన్యాయం

జిల్లాలోని వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ఈ బడ్జెట్‌ చూసి హతాశులయ్యారు. ఎప్పు డో రావాల్సిన బకాయిలపై ప్రభుత్వం ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. జీతాలు ఇవ్వడమే గగనమైన ఈ ప్రభుత్వంలో, కొత్త పీఆర్‌సీ వస్తుందని ఆశించడం తప్పేనని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన పాతపెన్షన్‌(ఓపీఎస్‌) హామీని బడ్జెట్‌ పక్కన పెట్టేసింది. ఇది ఉద్యోగ వర్గాలను నిలువునా ముంచడమేనని సంఘాల నేతలు ధ్వజమెత్తుతున్నారు.

43,000 ఉద్యోగాల గారడీ

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఊసేలేదు. జిల్లాలో లక్షలాది మంది అభ్యర్థులు ఉన్నత చదువులు చదివి సరైన ఉద్యోగాలు లేక మిన్నకుండిపోతున్నారు. 43 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని బడ్జెట్‌లో ప్రస్తావించా రు. వాస్తవానికి జిల్లా నుంచి రోజూ 2.5 లక్షల మంది నిరుద్యోగులు బెంగళూరు, చైన్నెలకు పలు పను ల కోసం వలస వెళ్తున్నారు. నైపుణ్య శిక్షణా కేంద్రా లు, స్థానిక పరిశ్రమలపై సరైన స్పష్టత లేదు.

అంకెల గారడీ బడ్జెట్‌

రాష్ట్ర బడ్జెట్‌ కేవలం అంకెలగారడీ మాత్రమే. అత్యంత ముఖ్యమైన రైతు సంక్షేమాన్ని ఈప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. రాష్ట్ర వ్యవసాయ రంగానికి కేటాయించిన నిధులను చూస్తే రైతులపై సీఎం చంద్రబాబుకు ఎంత అక్కరుందో అర్థమవుతోంది. టమాటా, మామిడి, కూరగాయ పంటలు, తోట పంటలకు ధరల్లేక రైతులు అప్పుల పాలవుతున్నారు. పంటలబీమా, వ్యవసాయ సబ్సిడీ, కనీసం రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి పరిహారం కూడా ఇవ్వని పరిస్థితి. ధరల స్థిరీకరణ నిధికి కేవలం రూ.500 కోట్లు కేటాయించి చేతులు దులిపేసుకున్నారు. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌ చేస్తామని పాతపాటే పాడుతున్నారు. – వెంకటేగౌడ, మాజీ ఎమ్మెల్యే, పలమనేరు

పదో తరగతి యాక్షన్‌ప్లాన్‌ను పాటించాలి 
1
1/3

పదో తరగతి యాక్షన్‌ప్లాన్‌ను పాటించాలి

పదో తరగతి యాక్షన్‌ప్లాన్‌ను పాటించాలి 
2
2/3

పదో తరగతి యాక్షన్‌ప్లాన్‌ను పాటించాలి

పదో తరగతి యాక్షన్‌ప్లాన్‌ను పాటించాలి 
3
3/3

పదో తరగతి యాక్షన్‌ప్లాన్‌ను పాటించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement