అధైర్యపడొద్దు..అండగా ఉంటాం! | - | Sakshi
Sakshi News home page

అధైర్యపడొద్దు..అండగా ఉంటాం!

Apr 4 2026 7:43 AM | Updated on Apr 4 2026 7:43 AM

కుప్పం: శ్రీకూటమి పాలనలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం..ఎవ్వరూ అధైర్యపడకండి.. అందరికీ అండగా ఉంటాం.. మరో మూడేళ్లు నిజాయితీతో కలసికట్టుగా పనిచేద్దాంశ్రీ అని కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ భరత్‌ పిలుపునిచ్చారు. శ్రుకవారం తన క్యాంపు కార్యాలయంలో రామకుప్పం, శాంతిపురం బూత్‌ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, పార్టీకి బూత్‌ కన్వీనర్లే కీలకమన్నారు. అందరూ కలసి కట్టుగా పనిచేయాలని సూచించారు. నిజాయితీతో పనిచేసేవారికి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. సొంత ప్రయెజనాల కోసం పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వారు మళ్లీ వైఎస్సార్‌ సీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అటువంటి వారిని పార్టీలోకి రానిచ్చేది లేదని తేల్చిచెప్పారు. దొంగలు, మోసపూరిత రాజకీయాలు చేసేవారు వంద మంది అవసరం లేదని, నిజాయితీతో పనిచేసేవారు ప్రతి పోలింగ్‌ బూత్‌కు ఐదుగురు ఉన్నా చాలన్నారు. గెలుపోటములు రాజకీయాల్లో సర్వసాధారణమని, కానీ నమ్మక ద్రోహం చేసేవారిని మాత్రం వైఎస్సార్‌సీపీ దరిదాపుల్లోకి రానివ్వమని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిజమైన కార్యకర్తులు, జగనన్న అభిమానులు వైఎస్సార్‌సీపీకి అండగా నిలబడ్డారని, అలాంటి వారికి పార్టీ అండగా ఉంటుందన్నారు. పోలింగ్‌ బూత్‌ల్లో ఓటర్ల పర్యవేక్షణలో బూత్‌ కన్వీనర్లు జాగ్రత్తుగా ఉండాలని, అనుమానం వచ్చిన ఓటర్లపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. సమావేశంలో రామకుప్పం, శాంతిపురం మండలాల నాయకులు బాబురెడ్డి, కోదండపాణి, నాయనపల్లి కృష్ణమూర్తి, సుబ్రమణి, మురుగేష్‌, చంద్రారెడ్డి, బూత్‌ కన్వీనర్ల అధ్యక్షుడు విజయ్‌ కుమార్‌, రామకుప్పం సుగుణప్ప, గుడుపల్లె సంపంగి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement