ఏనుగుల గుంపు విధ్వంసం | - | Sakshi
Sakshi News home page

ఏనుగుల గుంపు విధ్వంసం

Feb 15 2026 7:27 AM | Updated on Feb 15 2026 7:27 AM

ఏనుగుల గుంపు విధ్వంసం

ఏనుగుల గుంపు విధ్వంసం

గుడిపాల: ఏనుగుల గుంపు మళ్లీ పంట పొలాలపై స్వైరవిహారం చేస్తోంది. రోజు మార్చి రోజు పంట పొలాలపై దాడులు చేస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున ఓవైపు అటవీశాఖ అధికారులు టపాసులు పేలుస్తుండగానే వాటిని లెక్కచేయకుండా పిళ్లారికుప్పం గ్రామ సమీపంలోని పంట పొలాలను ధ్వంసం చేశాయి. ఓవైపు కొబ్బరిచెట్లు, పశుగ్రాసం, మామిడికొమ్మలు, అరటిపంటను పూర్తిస్ధాయిలో ధ్వంసం చేశాయి. అక్కడక్కడా కొద్దిగా వేసుకొన్న చిన్న పంటలను నాశనం చేశాయి. దీంతోపాటు పైపులు, ఫెన్సింగ్‌తోపాటు ఇనుపగేట్లను కూడా విరగ్గొట్టాయి. ఒక్కసారిగా ఏనుగుల గుంపు పంటలపై పడడంతో పంటలన్నీ ఒక్కసారిగా నాశనం చేసి తిరిగి అటవీప్రాంతంలోకి వెళ్లిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement