దివ్యాంగుల పింఛన్లపై వివక్ష | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల పింఛన్లపై వివక్ష

Feb 15 2026 7:27 AM | Updated on Feb 15 2026 7:27 AM

దివ్య

దివ్యాంగుల పింఛన్లపై వివక్ష

ఐరాల: చంద్రబాబు ప్రభుత్వం దివ్యాంగులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తూ, నూత న పింఛన్లపై వివక్ష చూపుతోందని వైఎస్‌ఆర్‌ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్‌ ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం అసెంబ్లీలో జరుగుతన్న బడ్జెట్‌ సమావేశాల్లో శుక్రవారం మంత్రి కొండపల్లె శ్రీనివాస్‌ అసెంబ్లీ సాక్షిగా కేవలం వితంతు, వృయోవృద్ధుల నూతన పింఛన్లకు త్వరలో దర ఖాస్తులు స్వీకరిస్తామని ప్రస్తావించారన్నారు. అయితే దివ్యాంగుల నూతన పింఛన్లపై ఉద్దేశపూర్వకంగా ప్రస్తావించకపోవడం దివ్యాంగులపై కక్ష పూరిత ధోరణికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని వడ్రాంపల్లెలో 9 మంది దివ్యాంగుల పింఛన్లు అక్రమంగా తొలగించారన్నారు. పింఛన్ల అక్రమ తొలగింపుపై నిజా నిజా లు నిగ్గు తేల్చడానికి బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా నేటికీ దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ ఖాళీలు గుర్తించలేదని, ఎప్పటికీ భర్తీ చేస్తారో మంత్రి సూటిగా సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వం దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో జగనన్న స్ఫూర్తితో వైఎస్సార్‌ సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి సారధ్యంలో రాజీలేని పోరాటానికి సంసిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించారు

చిత్తూరు కలెక్టరేట్‌: రాష్ట్ర బడ్జెట్‌లో ఉద్యోగుల సంక్షేమానికి నిధులు ఎక్కడ అని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యా య సంఘం(ఆపస్‌) రాష్ట్ర అధ్యక్షుడు బాలా జీ ప్రశ్నించారు. శనివా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ ఉద్యోగులకు తీవ్ర నిరాశను మిగిల్చిందని విమర్శించారు. బడ్జెట్‌లో ఉద్యోగుల సంక్షేమంపై మొక్కుబడి మాటలతో సరిపెట్టారే తప్ప, ఆచరణాత్మకమైన నిధుల కేటాయింపులు లేకపోవడం శోచనీయమన్నారు. అత్యంత ప్రధానమైన 12వ పీఆర్‌సీ, డీఏ విడుదలపై బడ్జెట్‌లో ఎటువంటి కేటాయింపులు చేయకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక బకాయిల విడుదలకు ఎటువంటి రూట్‌ మ్యాప్‌ ప్రకటించకపోవడం దారుణమని ఆయన విమర్శించారు.

సంజీవయ్యకు ఘననివాళి

చిత్తూరు కలెక్టరేట్‌: దేశం గర్వించదగ్గ మహనీయుడు దామోదరం సంజీవయ్య అని జాయింట్‌ కలెక్టర్‌ రాజేంద్రన్‌ కొనియాడారు. శనివారం కలెక్టరేట్‌లో దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జేసీ మాట్లాడుతూ భారత రాజకీయాల్లోకి అట్టడుగు వర్గాల ఆశాజ్యోతిగా వెలిగిన మహనీయుడు దివంగత సీఎం దామోదరం సంజీవయ్య అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండో ముఖ్యమంత్రిగా ఆయన సేవలందించారన్నారు. 1960–62 మధ్య కాలంలో ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు నేటి తరాలకు మేలు చేస్తున్నాయని తెలిపారు. డీఆర్‌ఓ మోహన్‌కుమార్‌ మాట్లాడుతూ సామాజిక న్యాయానికి ఆయన మూల స్తంభంగా నిలిచారని వివరించారు. సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ విక్రమ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగుల పింఛన్లపై వివక్ష 
1
1/1

దివ్యాంగుల పింఛన్లపై వివక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement