ఏనుగులను తరిమేందుకు చర్యలు
గుడిపాల: ఏనుగులను తరిమేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతామని జిల్లా అటవీశాఖ అధికారి సుబ్బరాజు తెలిపారు. బుధవారం ఆయన చిత్తపార ఫారెస్ట్‌లో పంట పొలాలను సందర్శించారు. రైతులు మాట్లాడుతూ కొబ్బరి, మామిడి, అరటి, వరి పంటలను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని, రాత్రి వేళల్లో తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని వాపోయారు. సుబ్బరాజు స్పందిస్తూ రైతులందరికీ తప్పనిసరిగా నష్టపరిహారం అందజేస్తామన్నారు. ఏనుగులను తరిమేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆయనతో పాటు ఎఫ్‌ఆర్‌ఓ థామస్ సుకుమార్, డీఆర్‌ఓ కరణ్‌సింగ్, ఎఫ్‌బీవోలు కుసుమ, హరిప్రియ, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
22న విశ్రాంత ఉపాధ్యాయుల సదస్సు
చిత్తూరు కలెక్టరేట్ : విశ్రాంత ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 22న తిరుపతి జిల్లా కేంద్రంలో సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీటీఎఫ్ రాష్ట్ర అదనపు కార్యదర్శి చెంగల్‌రాయమందడి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరుపతిలోని కొరమీనుగుంటలో ఉండే గీతాంజలి పాఠశాలలో ఉదయం 10 గంటలకు సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో పెండింగ్‌లో ఉన్న పెన్షన్లు, గ్రాట్యూటీ, నూతన పెన్షన్ తదితర సమస్యల పై చర్చించనున్నట్టు పేర్కొన్నారు. అదే విధంగా ఏపీ రిటైర్డ్ టీచర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.
ఉపాధి అక్రమాలపై విచారణ
వి.కోట : మండలంలో ఉపాధి హామీ పనుల్లో జరిగిన అక్రమాలపై స్థానిక కార్యాలయంలో బుధవారం డ్వామా పీడీ విచారణ చెప్పట్టారు. నిండిన చెరువుల్లో ఉపాధి పనులు చెప్పట్టామంటూ నెలక్రితం ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్, ీఫిల్డ్ ఆఫీసర్లు దాదాపు రూ.2 కోట్ల వరకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఈ మేరకు వారిపై కేసు నమోదైంది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టడానికి డ్వామా పీడీ మండలంలోని 18 పంచాయతీలలో జరిగిన ఉపాధి పనులను పరిశీలించారు. అవకతవకలు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, ప్రజాధనాన్ని రికవరీ చేస్తామని తెలిపారు.
సీకాం డిగ్రీ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: స్థానిక అన్నమయ్య సర్కిల్ సమీపంలోని సీకాం డిగ్రీ కళాశాల అటానమస్ హోదా పొందిన తర్వాత డిగ్రీ కోర్సులకు సంబంధించి తొలి సెమిస్టర్ ఫలితాలను బుధవారం ఎస్వీయూలో వీసీ టాటా నర్సింగరావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు చేతుల మీదుగా విడుదల చేసింది. కార్యక్రమంలో సీకాం విద్యాసంస్థల అధినేత డాక్టర్ టి. సురేంద్రనాథ్‌రెడ్డి, డైరెక్టర్ టి.ప్రణీత్ స్వరూప్, పరీక్షల నియంత్రణాధికారి ఎం.మునిరాజ్ పాల్గొన్నారు
ఏనుగులను తరిమేందుకు చర్యలు
ఏనుగులను తరిమేందుకు చర్యలు
ఏనుగులను తరిమేందుకు చర్యలు


