ఇదే స్ఫూర్తితో పనిచేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : ప్రతి ఉద్యోగి స్ఫూర్తిగా పనిచేసే తత్వం అలవరుచుకోవాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో ఈ– సైకిళ్ల పంపిణీలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి అభినందన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ .. 24 గంటల వ్యవధిలో 5555 ఈ సైకిళ్ల పంపిణీ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదయ్యేలా విధులు నిర్వహించిన డీఆర్‌డీఏ సిబ్బంది పనితీరు అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని పనులు చేపట్టి జిల్లాకు మంచి పేరు తీసుకు రావాలన్నారు. ఈ సైకిళ్ల పంపిణీలో జిల్లా గిన్నిస్ బుక్ రికార్డులో నమోదు కావడం గర్వకారణమన్నారు. ప్రజలకు పర్యావరణహిత రవాణా సాధనాలను అందించడమే లక్ష్యంగా వీటిని పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో స్వచ్ఛంద కార్యక్రమాలు, ముస్తాబు కార్యక్రమం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నా రు. వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలను బలోపే తం చేయాలన్నారు. అనంతరం విధుల్లో ప్రతిభ చాటిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి పాల్గొన్నారు.
కలెక్టర్ చేతుల మీదుగా ధ్రువీకరణపత్రం
చిత్తూరు కలెక్టరేట్ : తెలుగు సాహిత్య, సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలకు గాను అందిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ధ్రువీకరణ పత్రం అందింది. శనివారం కలెక్టర్ బంగ్లాలో కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ చేతుల మీదుగా తెలుగు సాహిత్య, సాంస్కృతిక సమితి అధ్యక్షుడు తులసీనాథం నాయుడు ధ్రువీకరణ పత్రం స్వీకరించారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ధనంజయ, దర్శన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదే స్ఫూర్తితో పనిచేయాలి


