పిల్లల భవిష్యత్‌పై తల్లిదండ్రుల పాత్ర కీలకం
నారాయణవనం: పిల్లలకు క్రమశిక్షణతోపాటు ఉజ్వ ల భవిష్యత్తును అందివ్వడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉందని పలువురు పేర్కొన్నారు. స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలల సిల్వర్ జూబ్లీ వేడుక ల్లో భాగంగా గురువారం పేరెంట్స్‌డే నిర్వహించా రు. విద్యార్థులతోపాటు వారి తల్లితండ్రులకు ఆట ల పోటీలను నిర్వహించారు. టాపర్లకు తల్లిదండ్రులతో జ్ఞాపికలను అందజేశారు. మధ్యాహ్నం ఓపెన్ ఆడితోరియంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ ప్రవచనకర్త జొన్నవిత్తుల రాఘవశర్మ ‘విద్యార్థి వ్యక్తిత్యాన్ని తీర్చి దిద్దడంతో సనాతన ధర్మం పాత్ర ’పై ప్రవచించారు. పురాణాల నుంచి ఒక్కో అంశాన్ని మనం నేర్చుకుని అనుసరించాలన్నారు. సాయింత్రం ఓపెన్ ఆడితోరియంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతితిగా పాల్గొన్న జేఎన్‌టీయు ప్రొఫెసర్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ యువ ఇంజినీర్లకు టెక్నికల్, కమ్యూనికేషన్ స్కిల్స్ తోడైతేనే తమ కేరీర్‌ను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుందన్నారు. కళాశాలల చైర్మన్ అశోకరాజు, ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు పాల్గొన్నారు.
లోన్ ఇవ్వలేదని..
పలమనేరు: తనకు అన్ని అర్హతలున్నా అధికారులు రుణం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఓ మహిళ స్థానిక వెలుగు కార్యాలయం వద్ద వంటిపై పెట్రోల్ పోసుకుని అంటించుకుంటానంటూ బెదిరించింది. ఈ ఘటన గురువారం పలమనేరులో చోటుచేసుకుంది. మండలంలోని నడిమికల్లాడు గ్రామానికి చెందిన భవాని ఎస్‌హెచ్‌జీలో సరోజమ్మ సంఘ సభ్యురాలుగా ఉంది. ఈ గ్రూపులో ఈమెకు రూ.లక్ష రుణంగా మంజూరైంది. అయితే అదే గ్రూపులోని ఇతర సభ్యుల కారణంగా బాధితురాలికి రుణం అందకుండా పోయింది. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు అస్సలు పట్టించుకోలేదు. దీంతో ఆమె ఇక్కడి కార్యాలయం వద్ద తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది.


