అడుగుడుగునా దళారుల ‘గేట్ కీపింగ్’
తహసీల్దార్ కార్యాలయాల్లో నేరుగా అధికారులను కలవడం కంటే, బయట తిరిగే దళారులను కలవడమే పనులు కావడానికి సులువు మార్గమని ప్రజలు నమ్ముతున్నారు. దళారులు జిరాక్స్ సెంటర్ల నుంచి ఆపరేషన్ మొదలుపెడుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు, మండల కేంద్రాల్లోని కొన్ని జిరాక్స్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలే సమాంతర రెవెన్యూ ఆఫీసులుగా మారుతున్నాయి. మ్యుటేషన్ కావాలంటే ఇంత, పాస్ బుక్ రావాలంటే అంత అని ముందే రేట్లు ఫిక్స్ చేస్తున్నారు. దళారులకు కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ల నుంచి కొంత మంది తహసీల్దార్ల వరకు రహస్య మద్దతు ఉండడం. జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి గొడవలు ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుంటున్నాయి. ఇటువంటి సమయంలో నూతన జాయింట్ కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడితేనే సమస్యలు కొలిక్కి వస్తాయని ప్రజలు నమ్ముతున్నారు.


