పట్టు వస్త్రాల సమర్పణ | - | Sakshi
Sakshi News home page

పట్టు వస్త్రాల సమర్పణ

Feb 12 2026 7:26 AM | Updated on Feb 12 2026 7:26 AM

పట్టు వస్త్రాల సమర్పణ

పట్టు వస్త్రాల సమర్పణ

కాణిపాకం: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నుంచి శ్రీ భ్రమరాంభిక మల్లికార్జున స్వామివారి దేవస్థానం, శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్‌ పాల్గొని పట్టు వస్త్రాలను అందజేశారు. కార్యక్రమంలో కాణిపాక ఆల య చైర్మన్‌ మణినాయుడు, శ్రీశైలం దేవస్థానం చైర్మన్‌ రమేష్‌నాయుడు, ఈవో శ్రీనివాసరావు, బోర్డు సభ్యులు నాయకులు పాల్గొన్నారు.

దాతలు స్పందించేలా..

చిత్తూరు కలెక్టరేట్‌ : దాతలను స్ఫూర్తిగా తీసుకుని విద్యాశాఖ, సమగ్రశిక్ష శాఖ ప్రభు త్వ పాఠశాలల్లో మౌలి క వసతుల పెంపునకు విద్యాంజలి పేరుతో ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తున్నట్లు జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీ సీ వెంకటరమణ తెలిపారు. బుధవారం ఆయ న విలేకరులతో మాట్లాడారు. సేవాభావంతో ముందుకొచ్చే ఎన్‌ఆర్‌ఐలు, పూర్వ విద్యార్థులు, దాతల సహకారంతో సర్కారు బడుల్లో సౌకర్యాలు పెంచనున్నట్లు తెలిపారు. పాఠశాలల అవసరాలను గుర్తించి వివరాలను విద్యాంజలి 2.0 పోర్టల్‌లో నమోదు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంపై హెచ్‌ఎంలకు అవగాహన క ల్పించేలా ఎంఈవోల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోర్టల్‌లో పాఠశాలలను ఎలా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలో వివరిస్తున్నామని ఏపీసీ తెలిపారు.

పది పరీక్షల అబ్జర్వర్‌గా మువ్వా రామలింగం

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు నిర్వహించే పది పబ్లిక్‌ పరీక్షలకు అబ్జర్వర్లను నియమించారు. గతంలో జిల్లాలో డీఈవోగా పనిచేసి ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో ఇన్‌ఫ్రా జేడీగా ఉన్న మువ్వా రామలింగంను అబ్జర్వర్‌గా నియమిస్తూ రాష్ట్ర విద్యా శాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఆయన పది పబ్లిక్‌ పరీక్షల ప్రారంభం నుంచి చివరి తేదీ వరకు జిల్లాలో పర్యటించనున్నారు.

పది పరీక్ష కేంద్రాల్లో

సీసీ కెమెరాలు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో త్వరలో జరిగే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో సమస్యాత్మకంగా గుర్తించిన కేంద్రాలకు సీసీ కెమెరాలు అమర్చనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పరీక్షల విభాగం అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు బుధవారం డీఈవో కార్యాలయానికి అందాయి. ఆ ఉత్తర్వుల ప్రకారం మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మాస్‌కాపీయింగ్‌ ఎక్కువగా జరుగుతాయనే అనుమానాలు ఉండే కేంద్రాలను పరిశీలించి పేర్లను ఈ నెల 12 లోపు సిఫార్సు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పొరపాట్లు సరిదిద్దుకోండి

చిత్తూరు కలెక్టరేట్‌ : విద్యార్థి జీవితంలో పదో తరగతి మార్కుల జాబితా చాలా కీలకం. ఇందులో ఏ చిన్న పొరబాటు ఉన్నా భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పదో తరగతి విద్యార్థుల ఆధార్‌ వివరాలు పాఠశాల రికార్డుల్లోని వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ తప్పులను సరిదిద్దుకునేందుకు రాష్ట్ర పరీక్షల విభాగం అధికారులు అవకాశం కల్పించారు. విద్యాశాఖ ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పాఠశా ల యూడైస్‌ పోర్టల్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చింది.

ఏమేం మార్చుకోవచ్చంటే.....

విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, శరీరంలోని గుర్తులు (మోల్స్‌), కులం, ఉపకులం, ఫొటో, సంతకాన్ని మార్చుకునే వీలుంది. పుట్టిన తేదీ మార్చుకోవడానికి అవకాశం లేదు. యూడైస్‌ మార్చిన వివరాలను పాఠశాల రికార్డుల్లో సైతం సరిదిద్ది డీవైఈవో దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత హెచ్‌ఎంలపై ఉంది. సంబంధిత డీవైఈవో వద్ద నిర్ధారణ సంతకం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అవకాశం ఈ నెల 12వ తేదీ వరకే ఉంటుంది. గురువారం చివరి రోజు అని తెలిపారు.

పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించనున్నట్లు జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ వెల్లడించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యాహక్కు చట్టం కింద జిల్లాలోని ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో 2026–27 విద్యాసంవత్సరానికి పేద కుటుంబాల విద్యార్థులకు ఒకటవ తరగతిలో 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించనున్నట్లు తెలిపారు. ఐదేళ్లు నిండిన పిల్లలకు అడ్మిషన్‌ల కోసం ఈ నెల 20 నుంచి మార్చి 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నా రు. విద్యార్థులు తమ ఆధార్‌ ఆధారంగా ప్రాథమిక వివరాలతో www.cse.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ఏపీసీ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement