ఏనుగుల గాలింపు కోసం మరోదారి | - | Sakshi
Sakshi News home page

ఏనుగుల గాలింపు కోసం మరోదారి

Feb 14 2026 7:55 AM | Updated on Feb 14 2026 7:55 AM

ఏనుగుల గాలింపు కోసం మరోదారి

ఏనుగుల గాలింపు కోసం మరోదారి

గుడిపాల: ఏనుగుల గాలింపు కోసం మరో దారిని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్లు అటవీశాఖ డెప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ కరణ్‌సింగ్‌ అన్నారు. గుడిపాల మండలంలోని చిత్తపార అటవీ ప్రాంతంలో నెలరోజులకు పైగా తిష్టవేసిన ఏనుగుల గుంపు కోసం నరహరిపేట చెక్‌పోస్ట్‌ సమీపంలో నుంచి బట్టువాళ్లూరు గ్రామం సమీపానికి రోడ్డును ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం కొత్తగా అటవీప్రాంతంలో ఏనుగుల గాలింపు కోసం మద్రాస్‌క్రాస్‌ రోడ్డు సమీపంలో నుంచి నెల్లేపల్లి వంక వరకు మరోదారిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం శుక్రవారం నుంచి అటవీ ప్రాంతంలో జేసీబీలతో దారిని ఏర్పాటుచేసి అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఏనుగుల గుంపును తరిమేందుకు సిద్ధమవుతున్నామన్నారు. ఈ దారితో ఏనుగులు ఎప్పుడు వచ్చినా తరిమేందుకు అనుకూలంగా ఉంటుందని ఆయన తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement