హరికృష్ణారెడ్డికి ఘన సన్మానం
పెనుమూరు(కార్వేటినగరం): ప్రముఖ కవి, రచయిత, ఉప రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ప్రకృతి వ్యవసాయ రైతు హరికృష్ణారెడ్డిని ఆదివారం తిరుపతి ఆకాశవాణి కేంద్రం అధికారులు ఘనంగా సన్మానించారు. ఆయన నాలుగు దశాబ్దాలుగా వ్యవసాయ రంగానికి, ప్రకృతి వ్యవసాయానికి చేస్తున్న సేవలను గుర్తించి జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని సన్మానం చేసినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేతలు, వ్యవసాయ వర్సిటీ అధికారులు రవికుమార్, సుమతి, ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ సుధాకర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.


