మార్మోగిన గాయత్రీ మంత్రం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా మంగళవారం పలు పాఠశాలల్లో గాయత్రీ మంత్రం మార్మోగింది. శ్రీ సత్యసాయి సేవ సంస్థలు ఆధ్వర్యంలో జిల్లాలోని పలు పాఠశాలల్లో ఈ నెల 8 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు సామూహిక ‘శ్రీ సత్యసాయి గాయత్రీ తండులార్చన’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని పలు విద్యాసంస్థల్లో విద్యార్థులతో సామూహికంగా 108 పర్యాయాలు గాయత్రీ మంత్రాన్ని పఠింపజేశారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా సమన్వయకర్త జి.శంకర్, జిల్లా అధ్యక్షులు ఎస్.మధుసూదనం, బాలవికాస్ గురువులు అనురాధ, సత్యనారాయణ, కల్పన, కమలప్రభ, సాయిలక్ష్మి, శ్రీదేవి, వాసవి పాల్గొన్నారు.


