ఆర్‌డీఎస్‌ఎస్‌ పనులు వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

ఆర్‌డీఎస్‌ఎస్‌ పనులు వేగవంతం చేయండి

Feb 6 2026 7:34 AM | Updated on Feb 6 2026 7:34 AM

ఆర్‌డీఎస్‌ఎస్‌ పనులు వేగవంతం చేయండి

ఆర్‌డీఎస్‌ఎస్‌ పనులు వేగవంతం చేయండి

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలో ఆర్‌డీఎస్‌ఎస్‌ పనులు ఆశించిన వేగంగా జరగడం లేదని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్‌ అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఎస్‌ఈ కార్యాలయంలో నిర్మా ణ, ఎంఆర్‌టీ విభాగం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 421 ఫీడర్లపరంగా ఆర్‌డీఎస్‌ఎస్‌ పనులు చేయాల ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కాగా ఇప్పటి వరకు 200 ఫీడర్లు మాత్రమే పూర్తి చేసినట్టు వెల్లడించారు. మార్చిలోపు మిగిలిన ఫీడర్ల పనులు చేయడం కష్టంగా మారిందన్నారు. పనులు వేగంగా చేయడానికి అదనపు సిబ్బందిని పెట్టుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ఇప్పటి వరకు ప్రభుత్వ, వాణిజ్య సర్వీసులకు స్మార్ట్‌ మీటర్లు బిగింపు పను లు పూర్తిచేశారన్నారు. నివాస సర్వీసులపరంగా 200 యూనిట్లు దాటినవారికి మీటర్ల ఏర్పాటు వేగవంతంగా చేయాలన్నారు. గత నెలలో జిల్లాలో 590 ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులయ్యాయని, వేసవిని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈఈలు మునిచంద్ర, సురేష్‌, శ్రీనివాసమూర్తి, భాస్కర్‌నాయుడు, ఏఓ బాలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement