ఎంపీపీ ఎన్నిక వాయిదా
చిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని బి.కొత్తకోట ఎంపీపీ ఎన్నిక గురువారం కూడా వాయిదా పడిందని అధికారులు తెలిపారు. ఎంపీపీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు. ఆ కేటగిరిలో ఎంపీటీసీలు ఎవరూ లేకపోవడంతో మరోసారి ఎన్నిక వాయిదా వేశామన్నారు. ఈ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించామన్నారు. తదుపరి ఎన్నిక జరిగే వరకు ప్రస్తుతం ఉన్న వైస్ ఎంపీపీ ఇన్‌చార్జిగా యథావిధిగా కొనసాగుతారన్నారని తెలిపారు.
‘పది’ ఫీజు చెల్లింపునకు తత్కాల్ అవకాశం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పబ్లిక్ ఫీజు చెల్లించేందుకు తత్కాల్ అవకాశం కల్పించారు. గురువారం డీఈవో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మార్చిలో నిర్వహించే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు తత్కాల్‌తో ఈ నెల 12వ తేదీ లోపు ఫీజు చెల్లించవచ్చన్నారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో ఈనెల 12వ తేదీలోపు నామినల్ రోల్స్‌ను అప్‌లోడ్ చేయాలన్నారు. నిర్ణీత పబ్లిక్ ఫీజుతో పాటు అదనంగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇతర వివరాలకు డీఈవో కార్యాలయంలోని పరీక్షల విభాగంలో సంప్రదించాలని ఆయన కోరారు.
సమాజ భాగస్వామ్యం కీలకం
యాదమరి: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యాప్రమాణాల మెరుగు కోసం సమాజ భాగస్వామ్యం అత్యంత కీలకమని జిల్లా విద్యాశాఖాధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాంజలి 2.0 అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. డీఈఓ మాట్లాడుతూ విద్యాంజలి 2.0 పోర్టల్ ద్వారా స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వదలిచిన వారు ఆయా పాఠశాలల్లో సంప్రదించాలన్నారు. ఎంఈఓ – 2 ప్రసాద్ పాల్గొన్నారు.
జిల్లాకు 400
మెట్రిక్ టన్నుల యూరియా
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాకు శుక్రవారం 400 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని గురువారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళితెలిపారు. ప్రస్తుతం ఉన్న నిల్వను పకడ్బందీగా పంపిణీ చేసేలా ఆదేశాలిచ్చామన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లా సరఫరా కానున్న యూరియాను కూడా సచివాలయాల ద్వారా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
పెళ్లి చూపులని
మోస పోయాడు!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పెళ్లిచూపుల కోసం ఓ యువకుడు ఆన్‌లైన్ అన్వేషణలో పడ్డా డు. మ్యాట్రీమోనీ ద్వారా యువతి కోసం వెదికా డు. అలా ఆన్‌లైన్‌లో పరిచయమైన ఓ యువతి.. చివరకు ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో మోసగించింది. రూ.3.8 లక్షల వరకు దారబోసుకున్న యువ కుడు.. చివరకు మోసపోయామని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు గురువారం తాలూకా పోలీసులు కేసు నమోదు చేశా రు. ఎస్‌ఐ అశోక్‌కుమార్ వివరాల మేరకు... చి త్తూరు మండలం, పెద్దిశెట్టిపల్లి గ్రామానికి చెంది న మునిక్రిష్ణ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నా డు. ఇతడు ఆన్‌లైన్ ద్వారా మోట్రీమోనీలో పెళ్లి చూపులు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో డిసెంబర్ 25వ తేదీన ఓ యువతి పరిచయమైంది. ఆ యువతి ఫొటోలు పెట్టడంతో పూర్తిగా నమ్మేశాడు. వాట్సాప్ ఫొటోలు, వీడియోకాల్‌తో పరి చయం కాస్త గట్టి పట్టింది. మెల్లగా ఆ యువతి యువకుడిని ఆన్‌లైన్ ట్రేడింగ్‌లోకి దింపింది. ఆ యువకుడు యువతికి విడతలగా వారీగా రూ.3.8 లక్షల వరకు పంపాడు. చివరకు మోస పోయామని తెలుసుకున్న మునిక్రిష్ణ సోమవారం పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసు కేసు నమోదు చేశారు. కాగా ఈ యువకుడు గతంలో ఓ సారి మోసపోయినట్లు సమాచారం.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 68,586 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,764 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.71 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది.ఙ


