భక్తిశ్రద్ధలతో సంకటహర చతుర్థి | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో సంకటహర చతుర్థి

Feb 6 2026 7:34 AM | Updated on Feb 6 2026 7:34 AM

భక్తిశ్రద్ధలతో సంకటహర చతుర్థి

భక్తిశ్రద్ధలతో సంకటహర చతుర్థి

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో గురువారం సంకటహరచతుర్థి గణపతి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రధాన ఆలయ అలంకార మండపంలో సిద్ధి బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులను సుగంధ పుష్పాలతో అలంకరించారు. ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం ఆలయ అధికారులు ఉత్సవ మూర్తులను తీసుకెళ్లి ఆస్థాన మండపంలో కొలువుదీర్చా రు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సా యంత్రం 5 నుంచి 6గంటల వరకు శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి గణపతి వ్రతానిన జరిపించారు.

స్వర్ణ రథంపై చిద్విలాసం

స్వయంభు శ్రీకాణిపాక వరసిద్ధి వినాయకస్వామి రాత్రి ఆలయ మాడ వీధుల్లో స్వర్ణరథంపై కటాక్షించారు. భక్తులు కర్పూర హారతులతో స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీ మోహన్‌, ఏఈఓ రవీంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement