ఫొటోగ్రఫీతో ఉపాధి అవకాశాలు | - | Sakshi
Sakshi News home page

ఫొటోగ్రఫీతో ఉపాధి అవకాశాలు

Feb 19 2026 9:49 AM | Updated on Feb 19 2026 9:49 AM

ఫొటోగ్రఫీతో ఉపాధి అవకాశాలు

ఫొటోగ్రఫీతో ఉపాధి అవకాశాలు

● వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ సదస్సులో

ఇనేష్‌ సిద్ధార్థ

పుత్తూరు: ఫొటోగ్రఫీ కేవలం హాబీ మాత్ర మే కాకూడదని, ఆదాయ వనరుగా మల ర్చుకోవచ్చని ప్రముఖ వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఇనేష్‌ సిద్ధార్థ సూచించారు. బుధవారం స్థానిక శ్రీవేంకటేశ్వర పెరుమాళ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇనేష్‌ సిద్ధార్థ విద్యార్థుల కు ఫొటోగ్రఫీపై మెలకువలు తెలియజేశారు.

అడవిలో అప్రమత్తత అవసరం

వన్యప్రాణుల ఫొటోలు తీసే క్రమంలో జాగ్రత్తలు ఎంతో కీలకమన్నారు. ప్రకృతిని గౌరవిస్తూనే అద్భుతమైన ఫొటోలను ఎలా తీయవచ్చో తెలియజేశారు.

మ్యాక్రో ఫొటోగ్రఫీపై ప్రత్యేక దృష్టి

సాధారణంగా కంటికి కనిపించని సూక్ష్మ ప్రపంచాన్ని ఫొటోల్లో బంధించే మ్యాక్రో ఫొటోగ్రఫీ సెషన్‌ విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. కీటకాలు, చిన్న చిన్న జీవులను క్లోజప్‌లో తీసేటప్పుడు ఫోకస్‌, లైటింగ్‌, లెన్స్‌ల వినియోగంపై వివరించారు.

ఎన్‌ఎఫ్‌టీ ద్వారా ఉపాధి

నాన్‌–ఫన్‌జిబిల్‌ టోకెన్‌(ఎన్‌ఎఫ్‌టీ) ఫ్లాట్‌ఫారమ్‌పై తాము తీసిన ఫొటోలను ఎలా విక్రయించుకోవాలో తెలియజేశారు. తద్వా రా ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవచ్చని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కళా శాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement