విరబూసిన ఆశలు!
ఆశాజనకంగా
మామిడి పూత
పుత్తూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట మామిడి. సుమారు లక్షన్నర ఎకరాల్లో సాగవుతోంది. ఏటా జనవరిలో పూత వికసించి పక్వానికి రావడం ఆనవాయితీ. ఈ యేడు జనవరిలోనూ పూర్తి స్థాయిలో పూత రాలేదు. వచ్చిన పూత సైతం మంచు ఉండడంతో కొన్ని తోటల్లో మగ్గి రాలిపోయింది. అధికారుల సూచనల మేరకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టడంతో జనవరి మూడో వారం నుంచి పూత రావడంతో పాటు పిందె కడుతున్న నేపథ్యంలో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఈ దశలోనూ మామిడి రైతులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తగిన జగ్రత్తలు పాటించాలని ఉద్యానవన శాఖ అధికారులు సూచిస్తున్నారు.
మార్కెటింగ్‌పై చొరవ చూపాలి
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడిలో చిక్కదనం (బ్రిక్స్) శాతం ఎక్కువగా ఉంటుంది. 8 నుంచి 12 శాతం వరకు చిక్కదనం ఉన్న కారణంగా చిత్తూరు మామిడికి డిమాండ్ ఎక్కువ. ఉద్యానవన శాఖ ప్రత్యేక శ్రద్ధ వహిస్తే ఎగుమతులు చేయడానికి అవకాశాలు ఎక్కువ. గల్ఫ్ దేశాలైనా సౌదీఅరేబియా, యూఏఈ, కువైట్ దేశాలతో పాటు ఈ ఏడు చైనాకు ఫల్ప్ అందిస్తే 60 శాతం వరకు ఎక్స్‌పోర్టు చేసేందుకు అవకాశం ఉంటుంది. మల్టినేషనల్ కంపెనీలైన పార్లె, బ్రిటానియా, ఐటీసీ కంపెనీల నుంచి ముందుస్తు మార్కెటింగ్‌కు అధికారులు చొరవ చూపాల్సి ఉంది. ఇలా చేయడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర సులభంగా అందించడానికి అవకాశం ఉంది.
చెర్లోపల్లిలో మందులు పిచికారీ చేస్తున్న రైతు
కళ్యాణపురంలో విరగబూసిన మామిడి పూత
విరబూసిన ఆశలు!


