వరసిద్ధుడి హుండీ ఆదాయం రూ.1.82 కోట్లు | - | Sakshi
Sakshi News home page

వరసిద్ధుడి హుండీ ఆదాయం రూ.1.82 కోట్లు

Feb 7 2026 9:45 AM | Updated on Feb 7 2026 9:45 AM

వరసిద్ధుడి హుండీ ఆదాయం రూ.1.82 కోట్లు

వరసిద్ధుడి హుండీ ఆదాయం రూ.1.82 కోట్లు

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీని బుధవారం ఆలయ అధికారులు లెక్కించారు. ఈవో పెంచలకిషోర్‌ పర్యవేక్షణలో జరిగిన ఈ హుండీ లెక్కింపులో రూ.1,82,25,471 ఆదాయం వచ్చింది. బంగారం 11 గ్రాములు, వెండి 910 గ్రాములుగా లెక్కగట్టారు. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.17,200 నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.1,57,895, ప్రచార రథా నికి రూ.2,105 వచ్చింది. యూఎస్‌ఏవి 481 డాలర్లు, సింగపూర్‌వి 12 డాలర్స్‌, మలేషి యావి 1 రింగిట్స్‌, యూఏఈ 1,070 దిర్హా మ్స్‌, ఆస్ట్రేలియావి 20 డాలర్స్‌ , కెనాడా 10 డాలర్లు, ఇంగ్లాడ్‌ 15 పౌండ్స్‌ వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఏఈవోలు వీంద్రబాబు, ప్రసా ద్‌, ధనపాల్‌, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

నాలుగు మద్యం బార్ల కేటాయింపు

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు జిల్లాలో లాటరీ పద్ధతిలో నాలుగు మద్యం బార్లను కేటాయించారు. చిత్తూరు నగరంలో మద్యం బార్ల నిర్వహణ కోసం అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేయగా.. మంగళవారం చిత్తూరు కలెక్టరేట్‌లో జరిగిన లాటరీ పద్ధతిలో బార్ల కేటాయింపు జరిగింది. ఇందులో నాలుగు బార్లను నిర్వాహకులు దక్కించుకున్నారు. ఫలితంగా జిల్లాలో మద్యం బార్ల సంఖ్య 11కు చేరింది. 2028– ఆగస్టు 31వ తేదీ వరకు మద్యం బార్లకు లైసెన్సులను కేటాయించారు.

శ్రీవారి దర్శనానికి

18 గంటలు

తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 61,655 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 21,003 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కాను కల రూపంలో హుండీలో రూ.3.89 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో దర్శించుకోగలుగుతున్నారు. ఇది లా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement