చిత్తూరు యువకులు పుదుచ్చేరిలో మృతి | - | Sakshi
Sakshi News home page

చిత్తూరు యువకులు పుదుచ్చేరిలో మృతి

Feb 17 2026 7:47 AM | Updated on Feb 17 2026 7:47 AM

చిత్తూరు యువకులు పుదుచ్చేరిలో మృతి

చిత్తూరు యువకులు పుదుచ్చేరిలో మృతి

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరానికి చెందిన ఇద్దరు యువకులు సోమవారం పుదుచ్చేరిలో జరిగిన ఓ ప్రమాదంలో మృతిచెందారు. చిత్తూరుకు చెందిన సాదిక్‌, జస్వంత్‌, జయంత్‌, నవాజ్‌ అనే నలుగురు స్నేహితులు ఆదివారం ద్విచక్ర వాహనాలపై పుదుచ్చేరికి వెళ్లారు. సోమవారం అక్కడి బీచ్‌లో స్నానాలు చేస్తుండగా భారీ రాకాసి అలలు వచ్చాయి. ఈ అలల్లో చిక్కుకున్న సాదిక్‌(22), జస్వంత్‌ చౌదరి (25) అనే ఇద్దరు చనిపోయారు. మిగిలిన ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. మృతదేహాలను కోట కుప్పం పోలీసులు.. పుదుచ్చేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

బస్సు టైర్‌ పేలి మహిళకు గాయాలు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): బస్సు టైర్‌ పేలి ఓ మహిళ గాయపడినట్టు చిత్తూరు తాలూ కా ఎస్‌ఐ అశోక్‌కుమార్‌ తెలిపారు. చిత్తూరు నగరం, మురకంబట్టు, వెంగమాంపురానికి చెందిన విజయ (51), కుమారవేలు ఆదివారం రాత్రి వేలూరు నుంచి చిత్తూరుకు బస్సు లో వస్తున్నారన్నారు. మాపాక్షి క్రాస్‌ వద్ద బస్సు టైర్‌ పేలి.. విజయ కాళ్లకు గాయాలయ్యా యి. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

నేటి నుంచి మహాసంప్రోక్షణ

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: టీటీడీ అనుబంధంగా ఉన్న నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత వేదనారాయణస్వామి ఆలయంలో ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు విమాన జీర్ణోద్ధరణ అష్టబంధన మహాసంప్రోక్షణ నిర్వహించనున్నట్లు టీటీడీ సోమవారం పత్రికా ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement