ఆదిశేషునిపై ఆదిమధ్యాంతరహితుడు
శేషవాహనంపై సోమస్కందుడు,
యాళి వాహనంపై జ్ఞానప్రసూనాంబ
శ్రీకాళహస్తి: నాగేంద్రాహారాయ..త్రిలోచనాయ.. అన్న ట్లు నాగేంద్రుని హారంగా చేసుకున్న సర్వేశ్వరుడు నా గరాత్రి పురస్కరించుకుని ఆదిశేషుని పడగల నీడన కొ లువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి ఉత్సవాల్లో ఐదోరోజున నాగరాత్రిగా పిలుస్తారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి సోమస్కందమూర్తి శేషవాహనంపై, జ్ఞానప్రసూనాంబ యాళివాహనంపై పురవీధుల్లో ఊరేగారు. వాహన సేవల్లో కళాకారుల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఉదయం స్వామి అమ్మవార్లు హంస, శుక వాహనాలపై ఊరేగారు. ఆలయ చైర్మన్ కొట్టే సాయి, ఈఓ బాపిరెడ్డి పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు
ఉదయం 10.30 గంటలకు: ఇంద్ర విమానం–చప్పర సేవ
రాత్రి 9.30 గంటలకు: నంది–సింహ వాహనసేవ
శివసాంస్కృతిక వైభవం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం శేష, యాళి వాహన సేవ ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉదయం 10 గంటలకు భరతనాట్య ప్రదర్శన అలరించింది. శివాని, శివ నాట్య కళా నిలయం ఆధ్వర్యంలో ప్రదర్శనలు ఇచ్చారు. మధ్యాహ్నం వరకు భక్తి రంజని, భజనలు, భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు కొనసాగాయి. భూ కై లాస్ నాటకం, యోగా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాయంత్రం తిరుపతి, చైన్నె, పలమనేరు ప్రాంతాల కళాకారులు భరతనాట్య ప్రదర్శన చేపట్టారు.
ఆదిశేషునిపై ఆదిమధ్యాంతరహితుడు
ఆదిశేషునిపై ఆదిమధ్యాంతరహితుడు


