గుంతలను తప్పించబోయి..
– అదుపు తప్పి బోల్తాపడిన లారీ
యాదమరి: గుడియాత్తం – చిత్తూరు రోడ్డు మార్గంలో గుంతలను తప్పించబోయి ఓ లారీ అదుపుతప్పి బోల్తాపడిన ఘటన కాశీరాళ్ల వద్ద చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. స్థానికుల వివ రా ల మేరకు.. తమిళనాడు రాష్ట్రం సేలం నుంచి హైదరాబాద్‌కు రసాయనిక పదార్థాలతో పా టు ఇనుప బోరు పైపులు వేసుకుని అధిక సామర్థ్యంతో లారీ వెళుతోంది. ఈ క్రమంలో కాశీరాళ్ల బస్ స్టాప్ వద్దకు చేరుకోగానే అసంపూర్తిగా ఉన్న మార్గంపై ఏర్పడిన గుంతలను తప్పించే యత్నంలో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ శివకుమార్, క్లీనర్‌కు ఎటువంటి గాయాలు కా లేదు. కాగా ఈ మార్గంలో అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులు వెంటనే పూర్తి చేసి ప్రమాదాల ను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇరువర్గాల ఘర్షణ
– బొమ్మనచేనులో పోలీసు బందోబస్తు
యాదమరి: ఇరువర్గాల మధ్య నడుస్తున్న ఓ వివాదం ఘర్షణకు దారి తీసిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండల పరిధి బొమ్మనచేను గ్రామంలో గత కొంతకాలంగా వ్యక్తిగత కక్షల వల్ల రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆ గ్రామంలో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ ఘర్షణకు దారితీసింది. దీంతో పలువురికి చిన్నపాటి గాయాలయ్యాయి. డీఎస్పీ సాయినాథ్ ఆదేశాలతో సీఐ శ్రీధర్ నాయుడు, స్థానిక ఎస్‌ఐ ఈశ్వర్ రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. గ్రామంలో మళ్లీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ పోలీ సు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ ఈశ్వర్ హెచ్చరించారు. జరిగిన సంఘటనపై ఫిర్యా దుల మేరకు కేసులు నమోదు చేస్తామన్నారు.
గుంతలను తప్పించబోయి..


