కూతురు ప్రాణం.. తల్లి పోరాటం
పేద కుటుంబం కావడం, కూలిపని చేసి కూడబెట్టిన డబ్బుతో పాటు, అప్పుచేసి తెచ్చిన నగదు, బంధువుల సహకారం కూడా అప్పటివరకు చేసిన వైద్యాని కే ఖాళీ అయిపోయింది. కూతురు ప్రాణం ఎలా కాపాడాలో తెలియక ఆ తల్లి కన్నీటి సుడిగుండంలో చిక్కుకుపోయింది. పేదరికంతో బాధ పడుతున్న తనకు చికిత్స చేయించే స్థోమత లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఓ వైపు చావు బతుకుల్లో కుమార్తె, ఇంకోవైపు రూ.20 లక్షలు ఎవర్ని అడగాలి.. ఏం చేయాలో పాలుపోని నిస్సహాయ స్థితిలో విలపిస్తోంది. దాతలు సాయం చేయగలిగితే తమ బిడ్డ ప్రాణాలను కాపాడుకోగలనిని బరువెక్కిన హృదయంతో దయార్థ హృదయాలను వేడుకుంటోంది. సాయం చేసే దాతలు తల్లి రాములమ్మ ఫోన్ నం. 9059078374కు పోన్‌పే, జీపే ద్వారా సాయం అందించాలని సూచిస్తోంది.


