పని చేయకనే బిల్లులు ఎలా పెడతారు?
శ్రీరంగరాజపురం : ఉపాధి పనులు చేయకుండానే కొందరు బిల్లులు పెడుతున్నారని డ్వామా పీడీ రవికుమార్ మండిపడ్డారు. శ్రీరంగరాజపురం మండల కేంద్రంలో బుధవారం పీడీ ఆధ్వర్యంలో బహిరంగ సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో పుల్లూరు, పద్మాపురం, మంగుంట, ఈకే కండ్రిక పంచాయతీలతోపాటు కొన్ని పంచాయతీల్లో ఉపాధి పనులు చేయకుండానే ఇతరులకు బిల్లు పెట్టిన వైనాన్ని బయటపెట్టారు. మొక్కలు ఒక రైతుకు మంజూరు చేస్తే మరొక రైతు పొలంలో నాటినట్టు తెలిపారు. తక్కువ పని చేసి ఎక్కువగా కొలతను కొలచి బిల్లులను మంజూరు చేసుకున్నట్టు పేర్కొన్నారు. అలాగే కూలీలకు రసీదు ఇవ్వకుండా బిల్లులు తీసుకున్నట్లు గుర్తించారు. అవినీతికి పాల్పడ్డ ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
2024–2025 మార్చి పనులకుగాను రూ.12,14, 39, 612 విలువ చేసే పనులు జరిగాయి. రికవరీ రూ.36, 662 చేశారు. ఎంపీడీఓ వనజ, ఏపీడీ సునిల్‌కుమార్, ఏపీఎం లలితకుమారి, ఎస్‌ఆర్‌పీ మురాజ్ పాల్గొన్నారు.


