కాసారా కటకటాలే ! | - | Sakshi
Sakshi News home page

కాసారా కటకటాలే !

Feb 9 2026 7:41 AM | Updated on Feb 9 2026 7:41 AM

కాసారా కటకటాలే !

కాసారా కటకటాలే !

● సారా స్థావరాలపై పోలీసులు దాడులు ● 250 లీటర్ల బెల్లం ఊట ధ్వసం ● కొటార్వేడులో కార్డన్‌ సెర్చ్‌

కార్వేటినగరం: పోలీసులు సారా విక్రయాలపై ఉక్కుపాదం మోతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఏఎస్పీ దేవదాసు, సీఐ హనుమంతప్ప, ఎస్‌ఐ తేజస్విని, ఎస్టీఎఫ్‌ బృందం సంయుక్తంగా కార్వేటినగరం మండలం కొటార్వేడు దళితవాడ అటవీ సమీపంలో దాడులు చేశారు. సారా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 250 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అనంతరం గ్రామంలో కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు. ద్విచక్ర వాహనాల రికార్డులు, వాహన యజమాని లైసెన్సును పరిశీలించారు. దైర్య స్పర్శలో భాగంగా భయానికి ముంగిపు – భద్రతకు భరోసా అనే కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఏఎస్పీ దేవదాసు మాట్లాడుతూ గ్రామాల్లో సారా, గంజాయి, బెల్టు షాపుల్లో మద్యం వక్రయాలతో గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. సారా కాస్తే కటకటాలు తప్పవన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ వ్యాపారాలకు స్వస్థి పలికితే బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి ఉపాధి కల్పిస్తామన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement