మొగిలి ఘాట్‌లో వాహనాలు ఢీ | - | Sakshi
Sakshi News home page

మొగిలి ఘాట్‌లో వాహనాలు ఢీ

Feb 8 2026 4:26 AM | Updated on Feb 8 2026 4:26 AM

మొగిల

మొగిలి ఘాట్‌లో వాహనాలు ఢీ

– ఇద్దరికి గాయాలు

బంగారుపాళెం : మండలంలోని మొగిలిఘాట్‌లో శుక్రవారం రాత్రి చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. పలమనేరు నుంచి చిత్తూరు వైపు పోతున్న పాల ట్యాంకర్‌ మొగిలి ఘాట్‌ మలుపు వద్ద ముందు పోతున్న ఐచర్‌ వాహనాన్ని ఢీకొంది. ఈక్రమంలో ఐచర్‌ వాహనం ముందు పోతున్న లగేజీ ఆటోను ఢీకొంది. దీంతో ఆటో రహదారిపై బోల్తా పడింది. అందులోని ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుచేసుకోవడంతో బెంగళూరు నుంచి చైన్నె మార్గంలో ట్రాఫిక్‌ స్తంభించింది. సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన మాబూబాషా, హరీష్‌ను బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రహదారిపై ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మొగిలి ఘాట్‌లో   వాహనాలు ఢీ 1
1/2

మొగిలి ఘాట్‌లో వాహనాలు ఢీ

మొగిలి ఘాట్‌లో   వాహనాలు ఢీ 2
2/2

మొగిలి ఘాట్‌లో వాహనాలు ఢీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement